కార్తీక్ మందు తాగుతుంటే పక్కనే కూర్చుని కబుర్లు చెబుతుంది దీప. గతం గురించి చెబుతున్న దీప మాటలు వినకుండా నిద్రపోతాడు కార్తీక్. తెల్లారగానే హ్యంగోవర్‌తో బాధపడుతున్న కార్తీక్‌కి కాఫీ ఇస్తుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన దీపని తిడుతుంది. అనంతరం తనతోపాటు తీసుకొచ్చిన కొడుకు ఆనంద్‌ని కార్తీక్‌కి ఇస్తుంది. కొడుకుని చూసి చాలా సంతోషపడుతుంటాడు కార్తీక్. అది చూసి మోనిత సంతోషపడుతుంది. కార్తీక్‌కి గతం గుర్తు చేసేందుకు నానాపాట్లు పడుతుంటుంది దీప. ప్రతిసారి మోనిత దానికి అడ్డువస్తుంటుంది. గత ఎపిసోడ్‌లో కూడా అలాగే జరుగుతుంది. అయితే.. దీప ప్రయత్నాల వల్ల కార్తీక్‌కి కొంచెం కొంచెం గతం గుర్తొస్తూ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 21న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్ గురించే ఆలోచిస్తూ వాకిట్లో అటు ఇటు తిరుగుతుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ బాబు పేరు ఏంటని అడుగుతాడు. దాంతో కొద్దిసేపు నసిగిన మోనిత చివరికి కొడుకు పేరు ఆనంద్ అని చెబుతుంది. అది విని ఎక్కడో విన్నట్లు ఉందని అంటాడు కార్తీక్. అది మన బాబు పేరు కదా.. రోజు పిలుస్తుంటే వింటుంటావు కదా అని చెబుతుంది మోనిత. కార్తీక్ కూడా నమ్మేసి ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఇంతలో దీప ఇంట్లోకి వెళుతూ మోనిత కంట పడుతుంది. దాంతో చీర్రెత్తుకొచ్చిన మోనిత దీపని నా కాపురంలో నిప్పులు ఎందుకు పోస్తున్నావంటూ చెడమడా తిట్టేస్తుంది. దాంతో ఎక్కువ మాట్లాడితే గొంతు పిసికేస్తా అని బెదిరిస్తుంది దీప. అది విని కార్తీక్‌కి గతం గుర్తు చేసి అతని జీవితంతో అడుకుంటున్నావు అని అంటుంది మోనిత. అది విని మందులు వేసి ఆయన గతం మర్చిపోయేలా చేస్తున్నావు.. సైడ్ ఎఫెక్ట్స్ ఎంటో తెలియదా.. అయినా త్వరలోనే గతం గుర్తొచ్చేలా చేస్తా అప్పటివరకే నీ కుప్పిగంతులు అని కోపంగా అంటుంది దీప. ‘గతం గుర్తు రాదు.. రానివ్వను. ఈ జీవతం మొత్తం నాదే’ అని కోపంగా అంటుంది మోనిత. ‘నీ కొడుకుని తీసుకొచ్చావు కదా.. బాబు గతం గుర్తొచ్చిన చాలు కదా .. గతం మొత్తం గుర్తొచ్చినట్లే’ అని.. కార్తీక్‌ని పిలుస్తుంది. అక్కడికి వచ్చిన కార్తీక్‌తో బాబుతో గడిపిన సంగతులు గుర్తు చేసుకుంటే చాలా బావుంటాయని పుల్ల పెట్టి వెళ్లిపోతుందీ దీప. అది చూసి మోనితకి పీకల్దాక కోపం వస్తుంది. కానీ ఏం చేయలేక ఊరుకుండిపోతుంది.
మరో సీన్‌లో.. సౌర్య దగ్గరికి వచ్చిన హిమ ఒకరి చేతుల మీద మరొకరి పేరు వేయించుకున్న పచ్చబొట్టు గురించి మాట్లాడుతుంటుంది. అది పట్టించుకుని సౌర్య.. ఇల్లు మారిన కూడా తన అడ్రస్ ఎలా తెలుసుకున్నారని అడుగుతుంది అక్కడే ఉన్న తాత ఆనందరావుని. అతను చెప్పబోతుండగా వద్దని వారించి నీకెందుకు ఆ విషయం అని కోపంగా సౌర్యతో అంటుంది హిమ. అనంతరం ఇక్కడి మాటిమాటికి వస్తే అక్కడి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్లిపోతానని చెబుతుంది సౌర్య. వద్దని చెప్పి అక్కడి నుంచి హిమ, ఆనందరావు వెళ్లిపోతుండగా.. ఆగమని పచ్చబొట్టు ఎలా తీసేయించుకోవాలని అడుగుతుంది. అది విని హిమ కోపంతో ఊగిపోతూ.. పచ్చబొట్టు తీసేసినా, ఇల్లు మారినా నా మీద వట్టే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అనంతరం.. ఇంట్లో ఉన్న మోనిత ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడి వచ్చిన కార్తీక్‌ని ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. అలాగే దీప గురించి ఆరా తీస్తుంది. అది విని.. ‘నువ్వు హర్ట్ అయినా పర్లేదు.. నువ్వు నా భార్యవా లేక వంటలక్క నా భార్యనా’ అని అనుమానంగా అడుగుతాడు కార్తీక్. అది విన్న మోనితకి గొంతులో వెలక్కాయ పడ్టట్లు అవుతుంది. అనంతరం.. నీ భార్యని కాకుండానే నిన్ను కాపాడుకోడానికి ఇన్ని పాట్లు పడుతున్ననా అని మొసలి కన్నీళ్లు కారుస్తుంది మోనిత. అది విన్న కార్తీక్ నిజమే కావొచ్చని నమ్మేస్తాడు.
మరోవైపు.. గతం చెప్పగా కార్తీక్‌కి ఏం జరిగిందో అంత డాక్టర్ అన్నయ్యకి వివరిస్తుంది దీప. ఆయన గతం గుర్తొచ్చినట్లా లేదా అని అడుగుతుంది దీప. అది విని మొదట వచ్చిన మళ్లీ గతం మర్చిపోతాడమ్మా. అసలు చికిత్స తెలియాలంటే కార్తీక్‌ని హాస్పిటల్‌కి తీసుకురా అని అంటాడు. సరేనంటుంది దీప. ఇంకోవైపు.. తెల్లారగానే సూట్ కేసులో బట్టలు సర్ధుతుంటుంది మోనిత. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఎంటని అడుగుతాడు. దాంతో భార్యని కాదని అన్నావు కదా ఇంకేందుకు వచ్చావు.. నేను ఇక్కడ ఉండడం కూడా అనవసరం అని కోపంగా అంటుంది. దాంతో కూల్ అయినా కార్తీక్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాంతో అదే సందని భావించిన మోనిత.. తన మీద అనుమానం పోవాలంటే ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్లిపోదామని అంటుంది. వేరే దారి లేక కార్తీక్ కూడా ఓకే అంటాడు. అనంతరం డ్రైవర్ శివ, దీప దగ్గరకి వెళ్లి మోనిత, కార్తీక్ ని వేరే ఊరు తీసుకెళుతుందని చెబుతాడు. ఏం ఊరో కనుక్కోమని రిక్వెస్టు చేస్తుంది దీప. నిజానికి శివని పంపింది మోనితనే. వాళ్లని ఫాలో అవుతూ వచ్చి ఎక్కడికి వెళ్లామో తెలిసి పిచ్చెక్కిపోతుందని సంతోషపడుతుంది. కార్తీక్ ని మోనిత ఏ ఊరికి తీసుకెళుతుందో తెలియాలంటే.. తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే