Acidity Bothering : మారిన లైఫ్ స్టైల్, మారిన ఆహార విధానం వల్ల మనం తరుచూ జబ్బు పడుతున్నాం. చాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటారు. ఆహారం తిన్న తర్వాత లేదంటే మామూలు సమస్యల్లో చాలామంది ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలను నివారించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
మలబద్దకం, ఎసిడిటీతో బాధపడే వారు లవంగాలు లేదంటే యాలకులను తీసుకుంటే మంచిది. ఇవి కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ మెరుగవుతాయి. యాలకులు పొట్టలో వేడిని తగ్గిస్తాయి. ఫలితంలగా మలబద్దకం సమస్య తగ్గుతుంది.
మలబద్దకం మరియు ఎసిడిటీతో బాధపడుతున్న వారు సోంపు గింజలను, పుదీనా ఆకులను తింటే ఉపశమనం కలుగుతుంది. అలాగే అల్లం ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. అయితే కొన్ని నీళ్లను తీసుకొని అందులో కొంత అల్లాన్ని, పుదీనా ఆకులను, సోంపు గింజలు వేసి మరిగించాలి. కాలి పడపోసుకొని ఈ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్దకం మరియు ఎసిడిటీ సమస్యలను నుండి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేదంలో పేర్కొనబడింది.
Acidity Bothering :
సాధారణంగా మనం ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కాలి వడపోసిన నీటిని తాగమని పెద్దలు చెబుతుంటారు. మలబద్దకం లేదా ఎసిడిటీతో బాధపడే వారికి కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది. గోరువెచ్చని నీటిని ఉదయం పూట నిద్రలేచిన వెంటనే తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుందట. శరీరంలోని వ్యర్థాలు తొలగడంతో పాటు జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేసి మలబద్దకం మరియు ఎసిడిటీల నుండి ఉపశమనం కలుగుతుందట.