ఇండియన్ వైడ్ గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ మోస్ట్ పాపులర్ హీరోలు, హీరోయిన్స్, సినిమాల జాబితాని ఎనౌన్స్ చేస్తూ ఉంటారు. వొర్ మ్యాక్స్ అనే సంస్థ తాజాగా ఇండియన్ వైడ్ గా మోస్ట్ పాపులర్ హీరోలకి సంబందించిన జాబితాని ప్రకటించింది. ఈ జాబితాలో సౌత్ హీరోల ఆధిపత్యం కనిపించడం విశేషం. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ హీరోలలో నెంబర్ వన్ స్థానంలో తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నిలవడం విశేషం. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్స్, నెటిజన్లు అతని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
అలాగే విజయ్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అతని తర్వాత రెండో స్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉండటం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ మానియా ఎ రేంజ్ లో నడుస్తుందో చెప్పడానికి ఇది ఒకటి చాలు. ఆ తర్వాత మూడు, నాలుగు స్థానాలలో కూడా తెలుగు పాన్ ఇండియా హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ నిలవడం విశేషం. వీరిద్దరికీ ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో ఇండియన్ వైడ్ గా పాపులారిటీ పెరిగింది. దీంతో వారు ఈ జాబితాలోకి వచ్చారు. ఆ తర్వాత స్థానంలో రాకింగ్ స్టార్ యష్ ఉన్నాడు.
అయితే ఈ జాబితాలో బాలీవుడ్ నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే ఆరో స్థానంలో నిలిచాడు. మిగిలిన స్థానాలలో రామ్ చరణ్, మహేష్ బాబు, సూర్య, అజిత్ కుమార్ నిలవడం గొప్ప విషయం. టాప్ టెన్ జాబితాలోలో ఏకంగా తొమ్మిది మంది సౌత్ స్టార్స్ ఆధిపత్యమే ఉండగా అందులో మెజారిటీ స్థానాలలో టాలీవుడ్ స్టార్ హీరోల మోస్ట్ పాపులర్ హీరోలుగా నిలవడం గర్వించదగ్గ విషయం. ఈ జాబితా బట్టి ఇండియన్ వైడ్ గా సౌత్ ఇండియన్ హీరోల మానియా ఎ స్థాయిలో నడుస్తుందో చెప్పొచ్చు. మరి వచ్చే ఏడాది అయిన బాలీవుడ్ హీరోలు సౌత్ హీరోలని డామినేట్ చేయగలుగుతారా లేదా అనేది చూడాలి.