మెగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎప్పుడూ కూడా మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. పెద్ద కూతురు సుస్మిత ఉదయ్ కిరణ్ ఇష్యూ తర్వాత ఆమె మీద మీడియా ఫోకస్ పెద్దగా లేదు. మరల నిర్మాతగా, కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉండటంతో లైమ్ లైట్ లో ఉంది. అయితే శ్రీజ మాత్రం తన వ్యక్తిగత జీవితం విషయంలో ఎప్పుడు కూడా మీడియాకి టార్గెట్ అవుతుంది. ఫ్యామిలీకి తెలియకుండా మొదటి పెళ్లి చేసుకొని కొంతకాలం అతనితో జీవితాన్ని సాగించి విభేదాలతో దూరమయ్యింది. మొదటి భర్తకి విడాకులు ఇచ్చిన తర్వాత కూతురుని తీసుకొని అమెరికా వెళ్ళిపోయింది. అక్కడే కళ్యాణ్ దేవ్ తో ప్రేమలో పడి తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక రెండో పెళ్లి అయిన కుటుంబం అంతా దగ్గరుండి చాలా గ్రాండ్ గా శ్రీజ వివాహం చేశారు.
ఇక కళ్యాణ్ దేవ్ తో ఆమె ఒక బిడ్డని కంది. అయితే ఏమైందో గత కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాలకి మెగా ఫ్యామిలీ పెద్దగా సపోర్ట్ చేయకపోవడం ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఇక శ్రీజ కూడా తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ తో ఉన్న ఫోటోలని తొలగించింది. అతను కూడా అలాగే చేశాడు. దీంతో ఇద్దరు విడిపోయారని, విడాకులు కూడా తీసుకుంటున్నారని టాక్ ప్రస్తుతం నడుస్తుంది.
అయితే దీనిపై ఇద్దరిలో ఏ ఒక్కరు ఖండించే ప్రయత్నం కానీ, నిజం అని చేప్పే ప్రయత్నం కానీ చేయలేదు. ఇంతలోనే మళ్ళీ శ్రీజ మూడో పెళ్లి అంటూ మరో రూమర్ తెరపైకి వచ్చింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం ఉందో తెలియదు కానీ తాజాగా ఇన్స్టాగ్రామ్ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. తన కష్టంలో, తన బాధలో వెనకుండి తనకి నన్ను పడిపోకుండా బలంగా నిలబడ్డ తమ ఫామిలీ, ఫ్రెండ్స్ అందరూకి కూడా ఆ పోస్ట్ లో శ్రీజ కృతజ్ఞతలు చెప్పుకుంది. అయితే ఈ పోస్ట్ వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు.