తెలుగులో తూనీగా తూనీగా అనే సినిమాలో నటించిన నార్త్ ఇండియా హీరోయిన్ అంటే ఎవరూ గుర్తు పట్టరు కాని సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం వెంటనే రియా చక్రవర్తి కదా అని అంటారు. అంతా ఆమె పాపులర్ అయిపొయింది. కరోనా మొదటి లాక్ డౌన్ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో చనిపోయే ముందు వరకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న రియా చక్రవర్తినే అందరూ బ్లెమ్ చేశారు. ఆమె కారణంగానే సుశాంత్ మానసిక ఒత్తిడికి లైన్ ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం నడిచింది. సుశాంత్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు వరకు రియా చక్రవర్తి అతనితో పాటే ఉంది. అయితే అర్ధంతరంగా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ నింద రియా చక్రవర్తి మీద పడింది. దాంతో పాటు బాలీవుడ్ బడా ఫ్యామిలీల ఆధిపత్యం, మాఫియా అంతా కలిసి సుశాంత్ మరణానికి కారణం అని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. కావాలనే సుశాంత్ కెరియర్ నాశనం చేయడానికి రియా చక్రవర్తిని పావుగా వాడారని టాక్ కూడా నడిచింది. ఇక సుశాంత్ ఆత్మహత్య కేసులో భాగంగా అతను డ్రగ్స్ వాడుతూ ఉండేవాడనే విషయం బయటపడింది. ఇక అతనికి రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు డ్రగ్స్ ని ఇస్తూ ఉండేవారని పోలీసులు ఆధారాలతో సహా చూపించారు. దీంతో రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యింది.
జైల్లో కొంత కాలం ఉంది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకి వచ్చిన సుశాంత్ మరణం, డ్రగ్స్ ఉచ్చులో ఇరుక్కోవడం వంటి సంఘటనలు ఆమెని డిప్రెషన్ లోకి నెట్టాయి. దీంతో చాలా కాలం నుంచి రియా చక్రవర్తి బయటి ప్రపంచంలోకి రాలేదు. చాలా కాలం తర్వాత మరల కాస్తా హాట్ ఫోటోలతో తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో దర్శనం ఇచ్చింది. సినిమాలలో నటించడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తుందనే టాక్ ఆ మధ్య గట్టిగా వినిపించింది. ఈ నేపధ్యంలోనే తనలో అందం తగ్గలేదని చూపిస్తూ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. అయితే ఆమె ఫోటోలకి పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉండటం గమనార్హం. సుశాంత్ సింగ్ మరణం రియా చక్రవర్తి కెరియర్ పూర్తిగా నాశనం కావడానికి కారణం అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ బట్టి తెలుస్తుంది.