Senior Actress Geetha: ప్రముఖ నటి గీత తన సినీరంగ ప్రవేశం 1978లో తమిళ సినిమా భైరవి చిత్రంలో టైటిల్ పాత్రను పోషించడంతో ఆరంభించింది. ఈ చిత్రంలో ఈమె రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించింది.
ఈమె సుఖమో దేవి, క్షమించు ఎన్నోరు వక్కు, అవనళి, గీతమ్ మొదలైన పలు సినిమాలలో నటించి మలయాళ సినిమాలో పాపులర్ నటిగా గుర్తించబడి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.
అగ్ర హీరోలు అందరి సరసన నటించి కన్నడలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాగే తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలు కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. తెలుగు అభిమానులను కూడా కొంతవరకు సంపాదించుకుంది.
అయితే తాజాగా కమెడియన్ ఆలీ హోస్ట్ గా చేస్తున్న ఆలీతో సరదాగా షోలో కనిపించింది. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆమె వెల్లడించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు వల్లే తాను ఇండస్ట్రీకి వచ్చానని ఆమె చెప్పింది. ‘డ్యాన్స్ రాదంటున్నారు.. సాగర సంగమంలో కమల్ హాసన్ పక్కన ఎలా చేశారు..?’ అని ఆలీ ప్రశ్నించగా.. ఆ సినిమాలో తానేక్కడ డ్యాన్స్ చేశానని.. కమల్ హాసనే డాన్స్ చేశారని చెప్పింది.
తాను కేవలం పరిగెత్తుకుంటూ వెళ్లానని నవ్వుతూ చెప్పింది. చిరంజీవి గారితో సినిమాలో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయింది ఆయన తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేశానని. అప్పుడు డైలాగ్స్ చేతి మీద రాసుకుని చెప్పేదాన్నని ఏడుస్తూ తలదించుకుని డైలాగ్స్ చూసి చెబితే.. అదో యాక్టింగ్ అనుకున్నారు అని నవ్వుతూ చెప్పింది.
Senior Actress Geetha: కృష్ణంరాజు గారిని తలుచుకుంటూ నటి గీత కన్నీళ్లు..
అలాగే రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ.. నేను తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కారణం కృష్ణంరాజు గారు. ఆయన ఈరోజు లేరంటే మనసుకు చాలా బాధగా ఉందని చెప్పింది. అందరు వచ్చి ఏదో ఒక రోజు వెళతారు. ఆయన లేకపోవడం బాధిస్తోంది.. అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.