Anees Bazmee: ప్రస్తుతం బాలీవుడ్ లో అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. వరుసగా ప్లాప్ అవడంతో కొత్తగా వచ్చే ప్రతి సినిమాపై అంచనాలు నెలకుంటున్నాయి.
ఈ తరహాలో వచ్చిన భూల్ భులయ్యా-2 ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. బాలీవుడ్ మేకర్ అనీస్ బజ్మీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ప్లాప్ లతో సతమతమవుతోన్న బాలీవుడ్ కి కాస్త ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది.
గంగుబాయి కతియావాడి సినిమా తర్వాత బాలీవుడ్ కి దక్కిన సక్సెస్ పుల్ చిత్రంగా భూల్ భులయ్యా-2 నమోదైంది. దీంతో దర్శకుడు అనీస్ బజ్మీ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. ఇప్పుడీ డైరెక్టర్ కి ఆ సక్సెస్ మంచి అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి.
చాలా మంది బాలీవుడ్ బడా నిర్మాతలు ఇతనితో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. కానీ ఆయన మాత్రం చాలా సెలక్టివ్ గానే నిర్మాతల్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాని నిర్మాతలతో మాత్రమే సినిమాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది.
జీస్టూడియోస్ – ఎజిలాన్ ప్రొడక్షన్స్ సంస్థలతో ఓసినిమా చేయడానికి అనీస్ ఓకే చేశారు. ప్రముఖ నిర్మాతల్లో ఒకరైనా షారిక్ పటేల్
మాట్లాడుతూ.. అనీస్ తో కలిసి పనిచేసేందుకు చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు.
Anees Bazmee: భారీ బడ్జెట్తో రూపొందుతున్న అనీస్ బజ్మి సినిమా..
అనీస్ తప్పకుండా అందరికీ నచ్చే ఓ మసాలా సినిమాను ప్రేక్షకులకు అందిస్తాడని భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా నిర్మాణం జరుగుతుందనీ వచ్చే ఏడాది లో సినిమా రిలీజ్ అవుతుందనీ తెలిపాడు. ‘హల్చల్’ సినిమాతో అనీస్ బజ్మీ బాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఆ తర్వాత నో ఎంట్రీ సాండ్ విచ్, సింగ్ ఈజ్ కింగ్, థాంక్యూ, వెల్కమ్ బ్యాక్ రెడీ లాంటి చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. రచయితగానూ చాలా సినిమాలకు పనిచేసారు. దర్శకుడిగా పరిచయమైన తర్వాత రైటర్ గా కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాడు.