Rashmika Mandanna : తమిళ , తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది రష్మిక మందన్న. బాలీవుడ్‌లోనూ అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా సరసన గుడ్‌బై చిత్రంతో అదరగొట్టేందుకు సిద్ధమైంది. అపారమైన ప్రజాదరణ పొందిన అత్యంత అందమైన నటీమణుల్లో రష్మిక మందన్న కూడా ఒకరు. మిలియన్ల మంది ఫ్యాన్స్ ఫలోయింగ్ ఉన్నఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది. ఆమె క్యూట్ స్మైల్, అందమే ఆమెను నేషనల్ క్రష్‌గా మార్చాయి. ఇదే క్రమంలో రష్మిక మందన్న తన అప్‌కమిగ్ మూవీ ప్రమోషన్‌లు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గుడ్‌బై అని క్యాప్షన్‌ను జోడించి తన ఫోటోలను షేర్ చేస్తోంది.

Rashmika Mandanna : ఈ ఫోటోలో రష్మిక మందన్న తెలుపు రంగులో ఎత్నిక్ మోతిఫ్స్‌తో డిజైన్ చేసిన కార్సెట్ టాప్ ను వేసుకుంది. దీనికి మ్యాచింగ్‌గా ఎరుపు రంగులో ఉన్న హై వెయిస్టెడ్ ట్రౌజర్‌ను ధరించింది. ఈ లుక్‌లో ఎంతో స్టన్నింగ్‌గా కనిపించింది. కెమెరాను చూడకుండా సైడ్ యాంగిల్‌లో క్యాండిడ్ పోజు ఇచ్చింది. తన కురులను లూజ్‌గా వతులుకుని చెవులకు బంగారపు హూప్ రింగ్స్ పెట్టుకుని క్యూట్‌నెస్‌తో అదరగొట్టింది.

కొన్ని రోజుల క్రితమే గుడ్‌బై చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆసక్తి కరమైన ఈ ట్రైలర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే కథనంతో చిత్రీకరణించిన కుటుంబ కథా చిత్రం గుడ్‌బై. ప్రతి కుటుంబంలో ఉండే హెచ్చుతగ్గులు, బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, కోపాలు, గందరగోళాలలను కల్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ సమర్పిస్తున్న డైరెక్టర్ వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రింలో ఎల్లి అవ్రామ్, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా, అభిషేక్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 7న థియేటర్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.

రష్మిక మందన్న సిద్దార్ధ్ మల్హోత్రాతో కలిసి శంతను బగ్చీ డైరెక్టర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ మిషన్ మంజు లో నటిస్తోంది. అంతే కాదు అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న ఆనిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తో రొమాన్స్ చేస్తోంది. ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదల కానుంది.

బాలీవుడ్‌లోనూ కాదు తమిళంలోనూ సూపర్ స్టార్ తలపతి విజయ్ సరసన వారీసు సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ మూవీ 2023 జనవరిలో విడుదల కానుంది.
