Vastu Tips: వాస్తు అనేది ఇంటి స్థితిగతులను మార్చివేస్తుందని మనకు తెలుసు. అందుకు ఇంట్లోని ప్రతి వస్తువును వాస్తు ప్రకారం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో అస్సలు ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో అశుభ ఫలితాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో తెలుసుకోండి.
చాలామంది ఇళ్లలో, ఇంటి బయట చిరిగిన బూట్లు లేదంటే చెప్పులు దర్శనమిస్తుంటాయి. కాంపాండ్ లోపల లేదంటే చెప్పుల స్టాండ్ లో చాలారోజుల క్రితం చిరిగిన బూట్లు లేదంటే చెప్పులను అలానే ఉంచినట్లయితే వెంటనే తీసి వెయ్యింది. ఇది కష్టాలకు సంకేతమని, కాబట్టి వాటిని ఇంటి నుండి వెంటనే తొలగించాలని వాస్తు చెబుతోంది.
విరిగిన వస్తువులను చాలామంది ఇంట్లోనే ఉంచుకుంటారు. విరిగిన గాజు వస్తువులు, విరిగిన ఇతర వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కేతువు ప్రభావం ఉంటుందట. దీని వల్ల అశుభాలు కలుగుతాయని కాబట్టి వెంటనే వాటిని ఇంట్లో నుండి తొలగించాలని వాస్తు చెబుతోంది. అలాగే ఇంట్లో వలలు ఉంచకూడదట. అలాగే ఇల్లు ఎప్పటికి పరిశుభ్రంగా ఉండాలని వాస్తు చెబుతోంది. వ్యర్థాలను ఇంట్లో నిలువ ఉంచుకోకూడదట.
Vastu Tips:
చాలామంది ఇళ్లలో సాలెగూళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని, వెంటనే వీటిని తొలగించాలని వాస్తు చెబుతోంది. అలాగే పక్షుల గూళ్లు ఇంటిలోపల లేదంటే ఇంటితో సంబంధం ఉండేలా ఉంటే వాటిని వెంటనే తొలగించాలట. అలాగే కుళాయి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని బాగు చేయించాలట.