Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తన గారాల పట్టి అల్లు అర్హ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరం లేదు. అంతే కాదు.. ఈ చిన్నారికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేతలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అందునా అల్లు అర్జున్ గారాల పట్టి కావడంతో ఈ చిన్నారికి క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఇక అల్లు అర్జున్ కూడా ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా కూతురు అర్హతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లాడిలా మారిపోతాడు బన్నీ. ఇప్పటికే అర్హకు సంబంధించిన పలు క్యూట్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోలను షేర్ చేశాడు బన్నీ. ఇందులో అర్హ.. గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. అదేంటి అని అడగ్గా.. జున్ను అని బన్నీ సమాధానం ఇస్తాడు. అందుకు అర్హ.. అవును నీకెలా తెలుసు అంటూ క్యూట్‌గా అడిగింది.
Allu Arjun : ఫాస్ట్‌గా చెప్పలేక ఓడిపోయిన బన్నీ
ఇక ఈ సారి నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు తెల్ల లారీలు అనే లైన్‌ను వేగంగా, కరెక్ట్‌గా చెప్పాలంటూ టంగ్ ట్విస్టర్ తన తండ్రికి ఇచ్చింది అర్హ. కానీ అది ఫాస్ట్‌గా చెప్పడం కాస్త కష్టం కాబట్టి ఈ ఛాలెంజ్‌లో ఫాస్ట్‌గా చెప్పలేక అల్లు అర్జున్ ఓడిపోతాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే చెప్పనక్కర్లేదు. పాజిటివ్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు.