Men Lies : భూమి మీద ఉన్న ప్రతి స్త్రీ, పరుషుడు, పిల్లలు కూడా అబద్ధాలు చెబుతుంటారు. పరిస్థితి, అవసరాన్ని అబద్ధాలు ఆడటం చాలా సాధారణం. అయితే అబద్ధాల వల్ల కలిగే నష్టం లేదంటే అవతలి వ్యక్తి కోల్పోయే దానిని బట్టి దాని తీవ్రత ఉంటుంది. సాధారణంగా ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు పార్ట్ నర్ తో కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి రావచ్చు. అయితే మామూలుగా మహిళలతో మగవారు చెప్పే కొన్ని అబద్ధాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మగవాళ్లు ఆడవాళ్లను బాధపెట్టకూడదని లేదంటే వాళ్లను సంతోష పెట్టడానికి ఎక్కువగా అబద్ధాలు చెబుతారట. చాలా వరకు వాదించడానికి ఇష్టపడనందుకు, ఏదో అబద్ధంతో ఆ సమస్యకు ముగింపు పలకడానికి మగవారు ఇష్టపడతారట. మగవాళ్లు ఒక స్త్రీతో ఉన్నా కానీ వేరే స్త్రీని చూస్తారట. కానీ పైకి మాత్రం తాను ఏ మహిళను చూడలేదని అబద్దం చెబుతారట.
ఆడవారిని కలిసిన మగవాళ్లు మామూలుగా తాము ధూమపానం లేదంటే మద్యపానం చేయమని చెబుతారట. కానీ వారు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారట. మరీ ముఖ్యంగా సిగరెట్ తాగిన తర్వాత వచ్చే దుర్వాసనను తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారట. అబద్ధం చెప్పి కవర్ చేయాలని ప్రయత్నిస్తారట. అలాగే మగవాళ్లు తమకు నచ్చిన ఆడవారి గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లు వారికి అబద్ధం చెబతారట.
Men Lies :
డబ్బుల విషయంలో మగవారు ఆడవారికి అబద్ధాలు చెబుతారట. మరీ ముఖ్యంగా పెళ్లికి ముందు తమ వద్ద చాలా డబ్బు ఉందని అబద్ధం చెబుతారట. అలాగే షాపింగ్ కోసం అప్పు చేసి ఖర్చు చేస్తారట. అదే పెళ్లి చేసుకున్న తర్వాత అస్సలు డబ్బు లేదని చెబుతారట. షాపింగ్ కు వెళ్లడాన్ని తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతారట. ఇక ఏ అమ్మాయితో పెళ్లికి ముందు సెక్స్ వరకు వెళ్లమని మగవారు అబద్ధాలు చెబుతారట.