Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలను తాను దూరం అయ్యానని, కానీ రాజకీయాలు తనకు దూరం కాలేదంటూ చిరంజీవి చేసిన ఆడియో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. చిరు ట్వీట్ చూసిన వారు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా అని చర్చించుకుంటున్నారు. కేవలం 10 సెకన్ల పాటు ఉన్న ఈ ఆడియో మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ డైలాగ్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తన్న గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్ అని కొంతమంది చెబుతున్నారు.
కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే చిరు తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఆడియో డైలాగ్ రిలీజ్ చేశారనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతోంది. సినిమాకు హైప్ తెచ్చేందుకు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బాగా చిరు ఈ ట్వీట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకానీ చిరు ట్వీట్ వెనుక రాజకీయాల్లోకి తిరిగి మళ్లీ వచ్చే ఆలోచన లేదని చెబుతున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసీఫర్ సినిమా భారీ విజయం సాధించింది. అత్యధిక కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా వచ్చింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది.
Chiranjeevi:
దీంతో లూసీపర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో చిరు తెరకెక్కిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు, చిరు అభిమానులు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. అందుకే ప్రమోషన్స్ కార్యక్రమాలను సినిమా యూనిట్ ప్రారంబించింది. చిరు ట్వీట్ కూడా పబ్లిసిటీ స్టంట్ గా తెలుస్తోంది. అంతేకాని రాజకీయాలకు చిరు మళ్లీ తిరిగి వచ్చే ఆలోచన అసలు లేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. రాజకీయాలకు మళ్లీ వచచే ఆలోచన లేదని పలుమార్లు చిరు చెప్పిన విషయం తెలిసిందే.