గత కొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డుల జాబితాలో ఆర్ఆర్ఆర్ మూవీ నిలుస్తుందని, కచ్చితంగా ఇండియా నుంచి ఈ మూవీకి ఆస్కార్ అవార్డులు రావడం పక్కా అనే టాక్ వినిపించింది. ఇక రాజమౌళి కూడా ఈ మూవీ ఆస్కార్ ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, తారక్ లో ఒకరికి అవార్డు గ్యారెంటీ అనే మాట కూడా వినిపించింది. ఇక ట్విట్టర్ లో అయితే ఈ విషయాన్ని నందమూరి ఫాన్స్, మెగా ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేశారు. ఇక గత మూడు రోజుల నుంచి ట్విట్టర్ లో ఇండియా మొత్తం రాజమౌళి, ఆర్ఆర్ఆర్ మూవీనే ట్రెండ్ లో నడిచింది.
ఈ సారి ఆస్కార్ బరిలో కచ్చితంగా ఆర్ఆర్ఆర్ మూవీకి రెండు, మూడు అవార్డులు గ్యారెంటీ అనే మాట కూడా వినిపించింది. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ చివరి అంకంలో ఈ మూవీకి నిరాశ ఎదురైంది. కనీసం ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ ఎంట్రీ కూడా లభించకపోవడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు అందరికి ఈ వార్త నిరాశని మిగిల్చింది. ఇక ఆస్కార్ వచ్చినా కూడా సినిమా తీసే విధానం తాను మార్చుకోనని రాజమౌళి కూడా ఆ ప్రచారంపై స్పందించారు. ఇక ఈ సినిమాకి అవార్డులు వస్తే ఇండియాలో చాలా మంది మేకర్స్ కి అది బూస్ట్ అవుతుందని చెప్పారు.
ఈ సారి ఆస్కార్ కి ఇండియా నుంచి గుజరాత్ బాషకి చెందిన ఓ చిన్న చిత్రం చలో షోకి ఎంట్రీ దక్కింది. ఈ విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ కూడా దొరకకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని, సౌత్ ఇండియా సినిమా ఆధిపత్యం తట్టుకోలేక దీనికి అడ్డంకులు సృష్టించారనే టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా గొప్ప చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి కూడా పంపించకుండా ఈ సినిమా అభిమానులు అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యేలా చేసారని చెప్పాలి. మరి దీనిపై సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం తెరపైకి వస్తుందనేది చూడాలి.