Biggboss 6 : నామినేషన్స్‌లో భాగంగా చలాకీ చంటి వర్సెస్ గీతూ పెద్ద రచ్చే జరిగింది. బయట ఒకలా ఉండి.. ఇక్కడ కెమెరాల కోసం రియల్‌గా ఉండటం లేదని చెప్పింది. తాను కూర చేశాననే రీజన్‌తో తినకుండా ఉండటంపై హర్ట్ అయినట్టు చెప్పింది గీతు. ఇక గీతుకి కౌంటర్ ఇస్తూ చంటి రివర్స్ నామినేట్ చేశాడు. సంస్కారం ఉండాలని చురక వేశాడు. దీంతో గీతు.. నీకు అసలు సంస్కారం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పింది గీతు. అందరితో గొడవ పెట్టుకోవడం గేమ్ కాదని.. చంటి అనడంతో.. ఆర్గ్యుమెంట్ కూడా గేమ్‌లో భాగం అని.. అందరితో గొడవలు పెట్టుకోవడానికి తనకి తీట లేదని చెప్పింది గీతు.
ఇక్కడ ఎవరికీ తీట లేదని చంటి కౌంటర్ ఇచ్చాడు. వీళ్లిద్దరి మధ్య గట్టిగానే గొడవ అయ్యింది. ఆ తరువాత చంటి రేవంత్‌ని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ విషయంలో రేవంత్.. వేరే వాళ్ల మాటలకు ప్రభావితం అయ్యాడని చెప్తూ నామినేట్ చేశాడు. గీతుని నామినేట్ చేస్తూ.. స్ట్రాటజీ స్ట్రాటజీ అంటూ ఫెయిర్‌గా ఆడటం లేదని చెప్పింది. కెప్టెన్సీ విషయంలో కూడా.. నామినేషన్స్‌లో ఉన్నాడనే కారణంతో రాజ్‌కి ఛాన్స్ ఇవ్వడం నచ్చలేదని చెప్పింది. తనకి బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్ ఇస్తానని చెప్పి అందలో తన బట్టలు పెట్టుకుంటుందని.. ఫెయిర్‌గా గేమ్ ఆడట్లేదని చెప్పింది ఇనయ.
Biggboss 6 : ఫైర్ మీదుంటేనే గుర్తింపు.. లేదంటే కష్టమే
ఫస్ట్ రీజన్ ఏమో కానీ రెండో సీజన్ సిల్లీగా అనిపించింది. ఒక హౌస్‌లో ఉండేముందు ఎలా మాట్లాడాలో తెలుసుకో అని ఫైర్ అయ్యింది ఇనయ. మొత్తంగా ఈ నామినేషన్స్‌లో 10 మంది ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, బాలాదిత్య, చంటి, గీతు, నేహా, సుదీప, ఆరోహి, ఇనయ, వాసంతి ఈ పది మంది నామినేషన్స్‌ల్ ఉన్నారు. అయితే నామినేషన్స్‌లో అంతెత్తున లేచే రేవంత్ మాత్రం ఈ వారం పెద్దగా రియాక్ట్ అవలేదు. నాగ్ శనివారం చేసిన హితబోధకు మనోడు గౌతమ బుద్ధుడు అయిపోయాడా? ఏంటని ప్రేక్షకులకు డౌట్ వస్తోంది. కోపం తగ్గించుకో.. ఇతరుల గురించి పెద్దగా మాట్లాడకు అన్నారే కానీ అసలు క్యారెక్టర్‌ని చంపుకోమని చెప్పలేదే. ఫైర్ మీదుంటేనే మనోడికి గుర్తింపు.. లేదంటే కష్టమే.