Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 అసలు ఆట మొదలైంది. రెండు వారాలు ముగిసిన ఈ సీజన్ లో షానీ, అభినయ ఎలిమినెట్ అయిన విషయం అందరికీ తెలిసిందే..! ఇక ముచ్చటగా మూడో వారం మొదటి రోజు అసలు ఘట్టం మొదలైంది. సోమవారం ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం నామినేషన్ల సమయంలో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాగ్వాదం సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది. బిగ్ బాస్ సూచనల మేరకు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అందరి కంటెస్టెంట్స్ మాదిరిగా ఇనయ సుల్తాన, వాసంతిని అదిరెడ్డి ఎలిమినెట్ చేశాడు.. ఈ క్రమంలో ఆదిరెడ్డి, ఇనయ సుల్తనాల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఈ యుద్దంలో బిగ్ బాస్ షో గురించి పలు విషయాలను వెల్లడించారు ఆది రెడ్డి.
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని వరికుంటపాడు ఆదిరెడ్డి గ్రామం. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఫ్రెండ్ సలహాతో ఓసారి సరదాగా బిగ్‌బాస్ రెండో సీజన్ పై రివ్యూ ఇస్తూ ఓ వీడియోను నెట్టింట అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో పాపులర్ అయ్యింది. దీంతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి బిగ్‌బాస్ షోలపై తనదైన విశ్లేషణతో ఆదిరెడ్డి గుర్తింపు తెచ్చుకున్నాడు. సో మొత్తానికి బిగ్ బాస్ గురించి రివ్యూలు చెప్పి చెప్పి ఆదిరెడ్డికి అసలు బిగ్ బాస్ షో అంటే ఏంటి అనేది పూర్తిగా తెలుసు.

ఆది రెడ్డి ఎలిమినేషన్స్ లో ఇనాయను సెలక్ట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు. చిన్న చిన్న సంభాషణలను సీరియర్ గా తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇందుకు ఇనాయ సమాధానం ఇస్తున్నప్పటికీ ఆది రెడ్డి తనదైన శైలిలో మాటలతో ప్రతిదాడి చేశారు. నేను మాట్టాడిన తర్వాత మాట్లాడండి అని గట్టిగా ఆరిచారు. మీరు ఇంత అరిస్తే… నేను అంత అరుస్తా.. దయచేసి వినండి ఇనాయ గారు అంటూ ఆమెకు సర్ధి చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు.
కానీ, మీరు బిగ్ బాస్ గురించి అన్ని తెలుసుకుని వచ్చారని ఇనయ అంది. అందుకు ఆదిరెడ్డి ఒప్పుకోలేదు. నేను ఏమీ తెలుసుకుని రాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్ కి బిగ్ బాస్ షో అంటే ఏంటో తెలుసు. బిగ్ బాస్ షో అనేది తెరిచిన పుస్తకం అని అన్నారు. బిగ్ బాస్ లో జరిగే విషయాలు ఎవరికి తెలియదు. సోమవారం నామినేషన్స్ ఉంటాయి. శనివారం ఎలిమినేషన్ ఉంటుందని అందరికీ తెలుసని ఆదిరెడ్డి చెప్పారు. అందరికీ తెలిసిన దానికి కంటే మీకు ఎక్కువ తెలుసు అంటూ ఇనాయ తన మనసులో మాటను చెప్పింది.105 రోజుల పాటు హౌస్ లో ఉంటామని వచ్చినప్పుడు బిగ్ బాస్ గురించి తెలుసుకుని రాకపోతే అది మీ తప్పు అంటూ ఆదిరెడ్డి అన్నారు. ముందు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని వచ్చారని మరలా ఇనయా అంది. దీంతో ఆదిరెడ్డి తన వాదనకు ముగింపు పలికాడు.