నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మలయాళీ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే నటిగా మెప్పించింది. ఇక శర్వానంద్ కి జోడీగా కూడాశ్రీకారం అనే సినిమాలో సందడి చేసింది. అయితే ఈ బ్యూటీకి తెలుగులో ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. సినిమ లు బాగున్నాయని టాక్ తెచ్చుకున్న హీరోయిన్ గా అవకాశాలు తెచ్చే స్థాయిలో మాత్రం ప్రియాంకాకి ఈ మూవీస్ గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. అయితే టాలీవుడ్ ని మెప్పించలేకపోయిన ప్రియాంకకి కోలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ తో డాక్టర్ మూవీతో అక్కడ సూపర్ సక్సెస్ కొట్టిన ప్రియాంక ఏకంగా సూర్యకి జోడీగా నటించే ఛాన్స్ ఈటీతో సొంతం చేసుకుంది.
ఆ మూవీ కూడా హిట్ అయ్యింది. తరువాత మళ్ళీ శివ కార్తికేయన్ తో డాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. దీంతో హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా రెండు పాన్ ఇండియా మూవీస్ ఈ బ్యూటీ హీరోయిన్ గా ఖరారైంది. అందులో ధనుష్ హీరోగా తమిళ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతుంది. దీంతో పాటు తెలుగులో జూనియర్ ఎన్ఠీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా మూవీలో కూడా ప్రియాంక అరుళ్ మోహన్ ని ఒక హీరోయిన్ గా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీలో ప్రియాంక మెయిన్ హీరోయిన్ కాదు. మెయిన్ లీడ్ కోసం బాలీవుడ్ నటి కోసం కొరటాల ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా తక్కువ సినిమాలతో ఏకంగా ప్రియాంక కోలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోవడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఈ బ్యూటీ గ్లామర్ పాత్రలకంటే పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.