Father Along With Two Daughters Suicide: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం.. గ్రామీణ మండలం రాజవోలులో విషాదం చోటుచేసుకుంది. రియల్ పురానికి చెందిన సత్యేంద్ర కుమార్ అనే వ్యక్తి ఇద్దరు కుమార్తెలు రిషిత(12), హద్విక(7) లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో చెరువు వద్ద సూసైడ్ లెటర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి కుమార్తెల మరణాలతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఆత్మహత్యకు గల కారణం తెలుస్తుంది. జీఎస్టీ బిల్స్, వివిధ వ్యాపారాలకు సంబంధించిన పనులు చేసుకునే సత్యేంద్ర గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు పని ఒత్తిడి కారణంతో మానసికమైన క్షోభ అనుభవించడం జరిగిందట.
ఈ క్రమంలో ఆత్మహత్య ముందు సత్యేంద్ర రాసిన ఏడు పేజీల లెటర్ లో తాను కోరుకున్న విధంగా జీవితం లేదని, ఆర్థిక ఇబ్బందులు మరియు పని ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు లెటర్ లో స్పష్టం చేశారు. అసలు ఆగస్టులోనే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసినట్లు.. అప్పుడు కుమార్తెలనాదులుగా మిగులుతారు అన్న ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు లెటర్ లో రాసినట్లు సమాచారం.కన్న కొడుకు మృతదేహం వద్దా తల్లి ఎంతగానో బోరున విలపించింది. డబ్బుల సంబంధించి చాలా ఖచ్చితంగా తన కొడుకు ఉంటాడని చెప్పుకొచ్చింది. మరి అటువంటి వ్యక్తి ఈ రీతిగా చనిపోవడం.. అసలు అర్థం కావటం లేదని బోరున విలపించింది.