దేవి తమ సంతోషానికి అడ్డువస్తుందని కోపం పెంచుకుంటుంది సత్య. ఆదిత్య, దేవిల మీద అరుస్తుంది. దాంతో దేవి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఆదిత్య బతిలాడే ప్రయత్నం చేసినా.. దేవి ఇక ఈ ఇంటికి రానని చెబుతుంది. మాధవ్ వంకర బుద్ధి తెలిసిపోతుంది జానకికి. దాంతో రాధ పడుతున్న బాధ అర్థమైతుంది. తనని క్షమించనమని వేడుకుంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దేవి కోసం వచ్చిన మాధవతో ‘ఇంకెపుడు దేవిని ఇక్కడికి పంపిచొద్దు బావగారు’ అని చెబుతుంది సత్య. తన వల్ల నా సంతోషం దూరమవుతుందని, దేవి ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి కావాలని అంటుంది. అదే అదనుగా భావించిన మాధవ్ ‘నాకు కావాల్సింది కూడా అదేనమ్మా.. ఇపుడు నీ సపోర్ట్ నాకు దొరికింది కదా. దేవిని ఈ ఇంటివైపు రానివ్వను. నువ్ కూడా నీ భర్తకు చెప్పమ్మా అంటూ హేళన చేస్తాడు. దేవీ ఇంకెపుడు ఈ ఇంటికి రాదని మాటిస్తాడు మాధవ్. మీ ఆయన కూడా మా ఇంటికి రాకుండా చూసుకోమని సత్యతో చెబుతాడు. ఆ తర్వాత మాధవ్ దేవిని తీసుకుని వెళ్లిపోతాడు.
సీన్ కట్ చేస్తే.. చిన్మయి ఒంటరిగా కూర్చుని రాధ గురించి ఆలోచిస్తుంది. అంతలోనే రాధ పాలు తీసుకుని చిన్మయిని వెతుకుతూ వస్తుంది. ‘ఏంది బిడ్డా.. ఎందుకు ఏడుస్తున్నావ్’ అంటుంది. ‘దేవిని నిజంగానే ఆఫీసర్ సార్‌కి ఇచ్చేస్తావా అమ్మా. దేవి ఇక్కడ ఉండదా? నాతో ఆడుకోదా.. నాకు దేవి, నువ్ ఇద్దరూ కావాలి. అంకుల్ దేవిని మాత్రమే తీసుకెళ్లిపోతారా.. అలా నన్ను వదిలేయద్దమ్మా. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను’ అంటూ ఎమోషనల్ అవుతుంది చిన్మయి.
గదిలోకి వెళ్లి ఏడుస్తుంది సత్య. ఆదిత్య కోపంగా వచ్చి.. చిన్నపిల్లలతో అలాగేనా ప్రవర్తించేది? అని కోప్పడతాడు సత్యను. ‘నా బాధ నీకు అర్థం కావట్లేదు. నువ్ నా భర్తవి. నీతో కలిసి ఉండాలని నాకు ఉంటది. నువ్ నన్ను కూడా పట్టించుకోకుండా దేవి మీద అంత ప్రేమ చూపిస్తున్నావంటే నాకు నీ మీద అనుమానం వస్తుంది. దేవిని అడ్డుపెట్టుకొని అక్కను కలవాలని చూస్తున్నావా? దూరమైపోయిందనుకున్న అక్కకు మళ్లీ దగ్గర కావాలని చూస్తున్నావా?’ అని నిలదీస్తుంది సత్య. దాంతో కోపంగా సత్యపైకి చేయి ఎత్తుతాడు ఆదిత్య. అపుడే దేవుడమ్మ వచ్చి అడ్డుకుంటుంది. ‘ఏంట్రా ఇది. నేనేం చెప్పిందేంటి, నువ్ చేస్తుందేంటి’ అని కోప్పడుతుంది. ఇంతకుముందు దేవుడమ్మ చెప్పిన మాటల్ని మళ్లీ రిపీట్ చేస్తుంది సత్య. మా ఇద్దరి మధ్య దూరం తగ్గించే ఆలోచన ఈ ఆదిత్యకు లేదు అంటూ కంటతడి పెడుతుంది సత్య. ప్రాణంగా ప్రేమించిన వాళ్లకి కూడా నచ్చకుండా ఎందుకురా ఇలా అవుతున్నావ్ అంటూ నిలదీస్తుంది కొడుకుని.
ఆ తర్వాత రామ్మూర్తికి కాఫీ తెస్తుంది జానకి. పిల్లలేరని అడగ్గా.. దేవి ఆదిత్య ఇంటికి వెళ్లిందని చెబుతుంది. అంతలోనే దేవి ఏడుస్తూ వస్తుంది. తాతయ్యా.. అంటూ పట్టుకుని ఏడుస్తుంది. ఏమైంది బంగారం అని అడగ్గా.. ‘నేను ఏం జరుగుతుందని భయపడ్డానో అదే జరిగిందని’ అంటాడు మాధవ. రాధ ఏమైందని అడగ్గా.. నేను ఇంకెపుడు ఆఫీసర్ సార్ ఇంటికి వెళ్లనని కంటతడి పెడుతుంది. ‘ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పినా వినకుండా ఆ ఇంటికి పంపారు. చిన్న పిల్లని చూడకుండా ఎలా బాధపెట్టారో చూడండి’ అంటూ వివరిస్తాడు మాధవ్. ఆ ఇంట్లో దేవి రావడం ఎవరికి ఇష్టం లేదు. పైపై ప్రేమను చూసి అదే నిజం అనుకుంటారు. ఆ ఆదిత్య భార్య మొహం మీదే చెప్పింది. మీ దేవిని మా ఇంటికి పంపొద్దని. అది కూడా ఆదిత్య ముందే. అంతలా ప్రేమ ఉంటే భార్యని ఆపచ్చు కదా అంటూ చెప్తాడు. ఇంకొకసారి నా పిల్లలు ఆ గడపతొక్కడానికి వీలు లేదంటూ వార్నింగ్ ఇస్తాడు.
సీన కట్ చేస్తే.. ‘అసలు నువ్ కట్టుకున్న భార్య మీదకి చేయి ఎత్తే అవసరం ఏముందిరా అంటూ నిలదీస్తుంది’ దేవుడమ్మ. అపుడు ఆదిత్య జరిగిందంతా వివరిస్తాడు. మీరు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటుంటే మీరు ఏంటిరా.. అయినా దేవి వచ్చిందని నువ్ ఆగిపోవడం ఏంటిరా? మీ మధ్య ప్రేమకు ఆ పసిపిల్ల అడ్డురావడం ఏంటి సత్య.. అంటూ ఇద్దర్నీ ప్రశ్నిస్తుంది దేవుడమ్మ. అప్పుడు కూడా ఆదిత్య, సత్య మళ్లీ వాదించుకుంటారు. ఆపండీ.. అంటూ అరుస్తుంది దేవుడమ్మ. ‘ఇద్దరూ మంచి చదువులు చదువుకున్నారు. మీకు నేను చెప్పడమేంటి రా’ అని బాధపడుతుంది. ‘అక్కడ ఉన్నది రాధ కాదు మా అక్క రుక్కు అని మీకెలా చెప్పాలి’ అని మనసులో అనుకుంటుంది సత్య. మా వల్ల నువ్ బాధపడకమ్మా.. దేవి కోసం సత్య మీదకి చేయి ఎత్తడం నాదే తప్పు. సారీ సత్య అంటాడు ఆదిత్య. మరి దేవుడమ్మ ఈ సమస్యని ఎలా పరిష్కరించనుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..