Krishnamraju: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన తోటి స్నేహితులతో సన్నిహితులతో చాలా క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎవరైనా ప్రభాస్ నీ కలిశారంటే కచ్చితంగా.. భోజనం చేసి వెళ్లాల్సిందే. కొంతమంది కత్తితో చంపేస్తారు, మరి కొంతమంది గనులతో చంపుతారు.. ప్రభాస్ మాత్రం భోజనాలు పెట్టి చంపేస్తాడు అంటూ ఒకానొక సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాల కామెడీ తరహాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా “రెబల్” సినిమా ప్రీ రిలీజ్ టైంలో.. లారెన్స్ కూడా ఈ తరహాలోనే వ్యాఖ్యలు చేశారు.
భోజనాల విషయంలో ఇండస్ట్రీలో చాలమంది ప్రభాస్ ప్రేమ మామూలుగా ఉండదు అని అంటారు. అంతేకాదు ప్రభాస్ షూటింగ్ చేసే సెట్ లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర స్పెషల్ మెనూ తీసుకుని మరి ఆతిథ్యం ఇస్తూ ఉంటారనీ..ప్రభాస్ తో వర్క్ చేసిన బాలీవుడ్ యాక్టర్స్ సైతం చెప్పటం జరిగింది. ప్రభాస్ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు ఇతరులకు ఆతిథ్యం ఇవ్వటంలో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతవారం కృష్ణంరాజు మరణించిన సమయంలో కడసారి చూడటానికి వచ్చిన అభిమానులకు కూడా ప్రభాస్ ప్రత్యేకంగా భోజనం పెట్టి మరి పంపించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు కృష్ణంరాజు సొంతూరు భీమవరం.. దగ్గర మొగల్తూరులో స్మారక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రభాస్ కుటుంబం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈనెల 29వ తారీకు జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రభాస్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం దాదాపు 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయాలని ప్రభాస్ మరియు కృష్ణం రాజు కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారట. అందుకుగాను ఇప్పటి నుండే తన టీంకి ప్రభాస్ ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.