స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూపర్ హిట్ చిత్రం పుష్ప. ఈ మూవీ పాన్ ఇండియా వైజ్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ మూవీని దర్శకుడు సుకుమార్ ఆవిష్కరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా పుష్ప మేకోవర్ లోకి వచ్చేశాడు. ఇక పార్ట్ 2 తో మరోసారి తన మ్యానియా చూపించాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఇక పుష్ప 1లో సమంత ఐటెం సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.
అందులో సమంత డాన్స్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ ప్రెషన్ నెక్స్ట్ లెవల్ అనే స్థాయిలో ఉన్నాయి. ఇక సమంతక్రేజ్ కూడా ఆ సాంగ్ మరింత పైకి తీసుకెళ్లింది. ఇక పుష్ప 2లో కూడా ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఊపు ఊపేలా అదిరిపోయే ఐటెం సాంగ్ పెట్టాలని సుకుమార్ భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సాంగ్ కోసం పాన్ ఇండియా స్థాయిలో అందరికి రీచ్ అయ్యే విధంగా బాలీవుడ్ ఐటెం క్వీన్, తెలుగులో గబ్బర్ సింగ్ తో కెవ్వు కేక ద్వారా అందరికి చేరువ అయిన మలైకా అరోరా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం ఆమెకి భారీగా రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. సమంత సాంగ్ కి మించే ఉండే విధంగా పుష్ప 2 కోసం ఐటెం సాంగ్ ని డిజైన్ చేయబోతున్నారు. మరి ఈ సాంగ్ ఏ స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ అవుతుందనేది చూడాలి. ఇదిలా ఉంటే పుష్ప మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా పాల్గొనే అవకాశం ఉంది.