Biggboss 6 : బిగ్ బాస్ 6వ సీజన్‌లో ఫస్ట్ ఎలిమినేషన్ గత శనివారం జరిగిన విషయం తెలిసిందే. తొలి వారం ఎవ్వరినీ ఎలిమినేట్ చేయకుండా వదిలేసిన బిగ్‌బాస్ ఈ సారి ఏకగా ఇద్దరిని ఎలిమినేట్ చేసి లెక్క సరి చేశాడు. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో షానీ సాల్మన్ శనివారం, అభినయ శ్రీ ఆదివారం హౌస్ నుంచి బయటకొచ్చేశారు. అయితే వీరిద్దరి ఎలిమినేషన్ ఖాయమని ముందుగానే ప్రేక్షకులు ఊహించారు. షానీ సాల్మన్ విషయం పక్కనబెడితే అభినయ మాత్రం అస్సలంటే అస్సలు స్క్రీన్‌పై కనిపించకపోవడం, అసలు గేమ్ ఆడేందుకు ఆసక్తే కనబరచకపోవడంతో ఎలిమినేట్ అయిపోయింది.
అయితే బయటికి వచ్చాక మాత్రం ఆమె షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అభినయ శ్రీ అంటే ప్రస్తుత టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలామందికి తెలియదు. ఎందుకంటే 2004లో ఆర్య మావీలో ‘అ అంటే అమలాపురం’ అంటూ ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో చేసి అంతర్ధానమై పోయింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ షోతో రీఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఏం లాభం.. అమ్మడు ఆడితే కదా.. తిని కబుర్లు చెప్పుకుంటూ కూర్చొంది. అసలు కంటెంటే ఇవ్వలేదు. మరి బిగ్‌బాస్ మాత్రం ఆమెను ఎలా చూపిస్తాడు? కాబట్టి అసలు ఆమె స్క్రీన్‌లోనే కనిపించకపోవడంతో ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. దీంతో రెండో వారమే బయటకు వచ్చేసింది.
Biggboss 6 : తొలి ఎపిసోడ్ నుంచి నన్ను సరిగా చూపించలేదు..
షో వల్ల తనకు బ్యాడ్ జరిగిందంటూ మీడియా వద్ద వాపోయింది. రోజుకు రూ.40 వేలు, అంటే ఇప్పటివరకు రూ.5 లక్షలు ఇచ్చారట కదా అని అభినయని ఓ మీడియా అడగ్గా.. అలాంటిదేం లేదని చెప్పేసింది. ఎవరు విన్నర్ అవుతారని అనుకుంటున్నారని అడగ్గా.. గీతూ, రేవంత్ ప్రతివారం నామినేషన్స్ లో ఉంటున్నారని, వాళ్లు సేవ్ కూడా అవుతున్నారని చెప్పింది. బహుశా వీరిద్దరిలో ఎవరో ఒకరు విజేత కావొచ్చని అభిప్రాయపడింది. ఇకపోతే తన విషయంలో జరిగింది మాత్రం కరెక్ట్ కాదని ఈమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘బిగ్ బాస్ లో ఉన్నానని ప్రేక్షకులకు చూపిస్తేనే కదా తెలిసేది. అమ్మ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా.. తొలి ఎపిసోడ్ నుంచి నన్ను సరిగా చూపించలేదని చెప్పారు. ఇందులో గుడ్, బ్యాడ్ ఏముంది.. నిజం చెప్పాలంటే నాకు బ్యాడే జరిగింది. రీఎంట్రీ అనే పెద్దకలతో వచ్చాను. ఆ కల నెరవేరలేదు’ అని అభినయ తన అసంతృప్తినంతా వెళ్లగక్కింది.