Biggboss 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గత రెండు వారాలు ఒక లెక్క ఈ వారం ఒక లెక్క అన్నట్టుగా నేడు రిలీజ్ చేసిన ప్రోమోను బట్టి తెలుస్తోంది. నేడు మూడవ వారం నామినేషన్స్ నేడు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. నాగార్జున పీకిన క్లాస్‌తో మొత్తం హౌస్‌మేట్స్ అంతా ట్రాక్‌లోకి వచ్చినట్టున్నారు.నామినేషన్స్ అంతా ఫుల్ గొడవ, కేకలతో కొంతమంది బీభత్సం సృష్టించేశారు. నామినేషన్స్ స్టార్టింగ్‌లోనే నీడలోంచి బయటకు రండి, ఎవరికీ భయపడకండి అని బిగ్‌బాస్ చెప్పగానే నామినేషన్స్ పర్వం ప్రారంభమైంది.
ఎవ్వరికీ భయపడొద్దు అని బిగ్‌బాస్ అభయ హస్తం ఇస్తే హౌస్‌మేట్స్ ఆగుతారా? రచచ రచ్చ చేసేశారు. ఒకరకంగా బిగ్‌బాస్‌కు కూడా కావల్సింది ఇదే అనుకోండి. ఒకరినొకరు నామినేట్ చేసుకుని మంటలు పుట్టించారు. ముఖ్యంగా గీతూ రాయల్- చంటి మధ్య జరిగిన గొడవ అయితే మొత్తాన్ని నివ్వెరబోయేలా చేసింది. ఈ వారం నామినేషన్స్‌లో శ్రీసత్య రెచ్చిపోయింది. మొన్న నాగ్.. గీతూని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక తానేం చేసినా చెల్లుతుంది అనుకుందో ఏమో కానీ ఇష్టానుసారంగా బిహేవ్ చేసింది.తొలుత పింకీని నామినేట్ చేసింది. గత వారం నామినేట్ చేసిన విషయాన్ని పట్టుకుని ఈ వారం ఆమెను నామినేట్ చేసింది గీతూ.
Biggboss 6 : దొబ్బేయ్.. దొబ్బేయ్.. ఫస్ట్ ఈడ నుంచి దొబ్బేయ్
ఇక చంటి గీతూని నామినేట్ చేశాడు.తను పెద్ద అనే విషయం మీద ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వనని గీతూ చెప్పింది. మనం 10 మందితో ఉన్నప్పుడు వారందరితో కొంచెం సంస్కారంగా బిహేవ్ చేయాలని చంటి చెప్పాడు. నాకేమీ తీట కాదు.. ఊరికే అందరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి అంటూ చంటి మీద ఫైర్ అయ్యింది. ఇక ఇనయాపై అయితే ఓ రేంజ్‌లో మండిపడింది. ఇష్టానుసారంగా మాట్లాడింది. ‘ఫేర్‌గా ఆడుతున్నావో.. అన్ ఫేర్‌గా ఆడుతున్నావో అది నీ గేమ్ కానీ అది నాకు అస్సలు నచ్చలేదు’ అని ఇనయా నామినేట్ చేసింది. నేను ఎలా ఆడుతున్నానన్నది అది నా చేతిలో ఉంది అని గీతూ తెలిపింది. దీంతో ఇనయ ఏదో చెప్పబోతే.. మాట్లాడనీ అని అరిచిన గీతూ.. దొబ్బేయ్.. దొబ్బేయ్.. ఫస్ట్ ఈడ నుంచి దొబ్బేయ్’ అంటూ చిరాకు పడింది. వామ్మో.. గీతూని ప్రశంసించినా కూడా తప్పేనేమో..