Samantha Ruth Prabhu : పర్సనల్ లైఫ్ పెద్దగా హ్యాపీగా లేకపోయినప్పటికీ ప్రొఫెషనల్ గా మాత్రం మంచి ఊపుమీద ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తీరికలేని షూటింగ్‌లతో బిజీ బిజీ అయిపోతోంది సమంత. ఓ పక్క యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటిస్తున్న ఈ చిన్నది బాలీవుడ్ పైన కాన్సన్‌ట్రేట్ చేసింది. బాలీవుడ్ దర్శకులు కూడా సామ్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారట.

Samantha Ruth Prabhu : లోకల్ గా స్టార్‌డమ్ ఉన్నా బాలీవుడ్‌లో అవకాశాలు దక్కాలంటే చాలా కష్టం. ఒకవేళ దక్కినా ఆ సినిమాలు హిట్ కాకపోతే ఖేల్ ఖతం దుకానం బంద్. కానీ సమంత విషయంలో అలా కాదు. బాలీవుడ్‌లో తన కెరీర్‌ను చిన్నగా బిల్డప్ చేసుకుంటూ వస్తోంది సమంత. మునుపెన్నడూ లేని విధంగా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది సామ్. ఈ వెబ్ సీరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఇక టెలివిజన్ బిగ్ షో కాఫీ విత్ కరణ్ లో అక్షయ్ కుమారత్ తో కలిసి టాక్ షోలో పాల్గిన బాలీవుడ్‌కు మరింత దగ్గరైంది. దీంతో ఇఫ్పుడు సామ్‌కు బాలీవుడ్ దర్శకులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారట. వరుస ఆఫర్లు సమంతను వెతుక్కుంటూ వస్తున్నాయట.

తాజాగా బాలీవుడ్ మీడియాలో సమంతకు సంబంధించి ఓ వార్త్ వైరల్ గా మారింది. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తీయబోతున్న సినిమాలో సామ్‌కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కామెడీ , హారర్ చిత్రంలో సామ్ మహారాణిలా కనిపించబోతోందట. ఇక హీరో ఆయుష్మాన్ ఖురానా రక్త పిశాచిలా భయపెట్టబోతున్నాడని సమాచారం.ఇదే నిర్మాణ సంస్థ హిందీ మీడియం, లూకా చుప్పీ, స్త్రీ వంటి సినిమాలను రూపొందించి హిట్‌లను తన అకౌంట్‌లో వేసుకుంది. ఇక అమర్ కౌశిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపైన షూటింగ్‌కి ముందే హోప్స్ పెరిగిపోయాయి. బాలీవుడ్ లో హారర్ కామెడీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.