Avoid these Foods: మనలో చాలామందికి ఆహారం అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. అందుకే ఎప్పుడుపడితే అప్పుడు నచ్చినది తింటూ కనిపిస్తుంటారు. అయితే చాలా వరకు రాత్రిపూట ఆహారాలను తగ్గించాలని నిపుణులు చెబుతుంటారు. పగటి పూట ఎలా తిన్నా రాత్రి మాత్రం ఆహారం విషయంలో జాగ్రత్త పాటించాలని చెబుతారు. అయితే కొన్ని ఆహారాలను రాత్రిపూట, పడుకునే ముందు అస్సలు తినకూడదని సలహా ఇస్తుంటారు. ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
చాక్లెట్లు:
మనలో చాలామందికి చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది. నోటికి ఎంతో రుచిగా, తీయగా అనిపించే చాక్లెట్లను తినడానికి అందరూ ఇష్టపడతారు. అయితే రాత్రిపూట చాక్లెట్లను తినకూడదని వైద్యులు చెబుతుంటారు. రాత్రి పూట చాక్లెట్లను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వారు హెచ్చరిస్తుంటారు.
చిప్స్:
స్నాక్స్ లాగా చాలామంది చిప్స్ ను ఇష్టపడతారు. అయితే రుచికి బాగా అనిపించే చిప్స్ ను రాత్రిపూట పడుకునే ముందు అస్సలు తినకూడదట. పడుకునే ముందు చిప్స్ తింటే జీర్ణక్రియలో ఇబ్బందులు వస్తాయట. ఫలితంగా నిద్ర కూడా ఇబ్బంది తలెత్తుతుందట.
Avoid these Foods: వెల్లుల్లి:
రాత్రిపూట వెల్లుల్లిని దూరంగా ఉంచితే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. స్వతహాగా పొటాషియం, భాస్వరాన్ని కలిగిన వెల్లుల్లిని రాత్రిపూట తీసుకోకపోవడం ఉత్తమం అని వైద్యులు చెబుతుంటారు. రాత్రిపూట వెల్లుల్లిని తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడటంతో పాటు నోరు దుర్వాసన వస్తుందట.