Biggboss 6 : గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి బిగ్ బాస్ ఆసక్తి ఉందా? లేదా? అనే విషయం పక్కనబెడితే… ఇప్పుడిప్పుడే షో ఊపందుకుంటోంది. హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ చెడుగుడు ఆడేసిన ఎఫెక్టో ఏమో కానీ హౌస్ మొత్తం ఫుల్ ఫైర్‌లో ఉంది. ఇక నాగ్ ఇన్ డైరెక్ట్ గా గొడవలు పడమని ఆర్డర్స్ కూడా ఇవ్వడంతో హౌస్‌మేట్స్ మరింత రెచ్చిపోయారు. దీంతో రాబోయే వారాలన్నీ రచ్చ రచ్చగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన మూడో వారం నామినేషన్స్ గొడవలకు అడ్డాగా మారింది.
బిగ్ బాస్ 6వ సీజన్ మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. దీంతో మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఒకరిని మరొకరు నామినేట్ చేస్తూ, వాళ్లిద్దరి మధ్య వాదప్రతివాదనలతో హౌస్ మొత్తం హీటెక్కింది. అరుపులు, కేకలతో దుమ్ము రేపారు. శ్రీసత్య-ఇనయా, చంటి-గీతూ, గీతూ-సుదీప, ఇనయా-గీతూ ఒకరిపై ఒకరు అరుస్తూ నామినేషన్స్ లో రచ్చ రచ్చ చేశారు. ఇక ఆదిరెడ్డి అయితే ఏకంగా బిగ్ బాస్‌నే బెదిరిస్తూ గట్టిగా మాట్లాడాడు. పళ్లెం ఎత్తేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
Biggboss 6 : గేమ్ తెలుసుకుని రాకపోవడం మీ తప్పు
ఈ వారం నామినేషన్స్ లో ఇనయాని తొలుత రంగు పూసి నామినేట్ చేశాడు. దీనికి కోపంగా రెస్పాండ్ అయిన ఆమె.. మీరు చాలా గేమ్ తెలుసుకుని వచ్చారు కాబట్టి.. అని అంటుండగానే ఆదిరెడ్డి ఫైర్ అయిపోయాడు. అలా అనడం రాంగ్, బిగ్ బాస్ ఓపెన్ బుక్.. గేమ్ తెలుసుకుని రాకపోవడం మీ తప్పు అని ఇనయాపై ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. ఇనయా ఏమాత్రం తగ్గలేదు. దీంతో కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆదిరెడ్డి.. ‘బిగ్ బాస్ పళ్లెం ఎత్తేస్తా’ అని బెదిరించాడు. స్టార్ మాలో నేటి ఎపిసోడ్ చూస్తే ఎలా ఉంటుందో ఏమో కానీ.. ప్రోమోలో ఈ సీన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.