Benefits of Soaked Foods: మనం మన పూర్వీకులు చెప్పిన మాటలని ఎప్పుడు పెడ చెవిన పెడుతూనే ఉంటాం. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎంతో అనుభవంతో మనకు చెప్తారు. వారు చెప్పిన విషయాల్లో ఆరోగ్య సూత్రాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ ఆరోగ్య సూత్రాల్లో ఒకటి రాత్రి నానబెట్టిన గింజలను ఉదయాన్నే తినడం వల్ల కలిగే లాభాల గురించి కూడా చెప్పారు. అలా గింజలను నానబెట్టిన గింజలను తినడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంతులు గురించి మనకు కలిగే ప్రయోజనాల గురించి మనం వింటూనే ఉంటాం. అలా మెంతులని నానబెట్టుకుని ఉదయమే తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మల బద్దకాన్ని దూరం చేస్తుంది.
2. అవిసె గింజల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ గింజలలో ఉన్న ప్రోటీన్, ఫైబర్ మరే గింజలలో కూడా దొరకదు. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలుని కలుగజేస్తాయి.
3. బాదం పప్పు తినడం వల్ల లాభాలు చాలానే ఉంటాయి. ఇది చిన్న పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా దొరుకుతుంది దీని వల్ల కొలెస్ట్రాల్ ని తగ్గించడంతో పాటు రక్త పోటుని కూడా నియంత్రిస్తుంది.
Benefits of Soaked Foods:
4. సాధారణంగా జుట్టు రాలే సమస్య చాలా మందిలో ఉంటుంది. అలాంటి సమస్యతో బాధ పడేవారు ఎండు ద్రాక్ష ని నానబెట్టుకుని తింటే జుట్టు రాలడం దూరమవడంతో పాటు ఇతర చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది.