Minister Roja : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. నేడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ.. పవన్ 2014లో పార్టీ పెట్టి వారికి, వీరికి మద్దతు ఇచ్చారని.. ఆయన్ను చూసి తెలుగు హీరోలు తలదించుకుంటున్నారని అన్నారు. ‘టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర వాయిదా వేసుకుంటే, నువ్వు వాయిదా వేసుకుంటావా?’ అని పేర్కొన్నారు. పవన్ కు 175 సీట్‌లలో పోటీ చేసే అభ్యర్ధులు లేరని ఎద్దేవా చేశారు.
వీకెండ్ బై ఆర్కే స్థానంలో పీకేను చూస్తున్నామని రోజా పేర్కొన్నారు. వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. ఇది విని రాష్ట్రంలోని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. జగన్ సీఎం కాలేవు అన్నావు.. నువ్వు ఎమ్మెల్యేవి కాలేకపోయావన్నారు. చిన్న పిల్లలు నీ మీటింగ్‌కు వస్తే సీఎం అనుకున్నావని రోజా ఎద్దేవా చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్‌టీఆర్ పార్టీ పెట్టీ అధికారంలోకి సింగిల్‌గా వచ్చారన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీ చేశారని రోజా గుర్తు చేశారు.
Minister Roja : నీ అభ్యర్ధులను పెట్టి జగన్‌తో ఢీకొను..
జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భోజనం చేసి హక్కులు రాష్ట్రం వదులుకున్నారని అంటున్నారని.. బీజేపీ, టీడీపీలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను వదిలి వచ్చినప్పుడు నువ్వు షూటింగ్‌లో ఉన్నావా? షుట్ కేసులు తీసుకుంటున్నావా? అని పవన్‌పై రోజా మండిపడ్డారు. నీకు దమ్ముంటే 175 సీట్లలో నీ అభ్యర్ధులను పెట్టి జగన్‌తో డీకొనాలని సవాల్ విసిరారు. పందులే గుంపుగా వస్తాయని.. ఈ రోజు లోకేష్ ఒక బుర్ర తక్కువ పని చేస్తున్నాడన్నారు. లోకేష్‌కు కేవలం అధికార దాహమని.. అందుకే ఎంఎల్‌సీ, మంత్రి అయ్యాడన్నారు. పొద్దున్నే ఎద్దుల బండి ఎక్కి వస్తుంటే చూసిన వాళ్లు నవ్వుకుంటున్నారన్నారు. లక్ష 23 వేల కోట్ల ఈ ప్రభుత్వం రైతులకు మూడున్నర ఏళ్లలో అందించిందన్నారు.