Pawan Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు దసరా తర్వాత వైసీపీ నాయకుల పని చెబుతా అంటూ సంచలన ప్రకటన చేశారు. అప్పటిదాకా మీ ఇష్టం. ఆ తర్వాత ఇంకా రాజకీయం వేరేగా ఉంటుంది అన్న తరహాలో.. పవన్ పెద్ద పెద్ద డైలాగులు వేయడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. అక్టోబర్ 5వ తారీఖు నాడు నుండి బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. కానీ అనూహ్యంగా ఆదివారం నాడు మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసాయి. అక్టోబర్ ఐదు నుండి జరగాల్సిన బస్సు యాత్రని వాయిదా వేసినట్లు పవన్ తెలిపారు.
పార్టీ సన్నధతపై కొన్ని సూచనలు వచ్చాయి. మేధావులు ఎన్నికల నిపుణులు ఇచ్చిన సూచనలు మేరకు.. జన వాని కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలపై మరింత అధ్యయనం చేసే పరిస్థితి ఉందని తెలిపారు. అందువల్లే యాత్ర వాయిదా వేస్తున్నట్లు పవన్ చెప్పుకోచ్చారు. అయితే పవన్ బస్సు యాత్ర వాయిదా పడటానికి కారణం లోకేష్ పాదయాత్ర అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పవన్ తన యాత్రకి బ్రేక్ ఇచ్చారని చెప్పుకొస్తున్నారు.
అంతేకాదు మరోపక్క అమరావతి పాదయాత్ర కూడా జరుగుతూ ఉండటంతో చంద్రబాబు ఆదేశాలు మేరకు పవన్ తన యాత్రని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటం కోసం తన అభిమానులను సైతం మోసం చేసే తరహా ప్రకటనలు పవన్ చేస్తున్నారని.. ధ్వజమెత్తుతున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో టీడీపీతో మళ్లీ జత కట్టడానికి జనసేన రెడీ అవుతుందని..టీడీపీ పార్టీలబ్దికోసం పవన్ మరి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.