Amith shah: తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమత్ షా హాజరైన విషయం తెలిసిందే. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ఇప్పటివరకు ఉత్సవాలు జరిపేందుకు భయపడిందని ఆరోపించారు. అయితే ఉత్సవాలు ముగిసిన తర్వాత బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. బీజేపీ కోర్ కమిటీలో సమావేశంలో అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ తో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీజేపీ బలోపేతంపై నేతలకకు రూట్ మ్యాప్ ఇచ్చారు.
అయితే ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ వ్యవహారంలో సరిగ్గా స్పందించనందుకు నేతలపై అమిత్ షా సీరియస్ అయ్యారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మరమనిషి అని వ్యాఖ్యానించిందుకు ప్రభుత్వం సీరియస్ అయింది. స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని ప్రబుత్వం డిమాండ్ చేసింది. కానీ మాటలో తప్పు లేదని, తాను క్షమాపణ చెప్పేది లేదని ఈటల తేల్చిచెప్పారు.
దీంతో ఈటలను అసెంబ్లీ సెషన్ మొత్తం నుంచి సస్పెండ్ చేశారు. కానీ దీనిపై బీజేపీ వర్గాలు పెద్దగా స్పందిచలేదు. ఈ విషయం అమిత్ షా దృష్టికి వెళ్లడంతో నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఈటలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా.. ఎందుకు స్పందిచలేదని సీరియస్ అయ్యారు. రాష్ట్రవ్ాయప్తంగా నిరసనలు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయాల్సి ఉండాల్సిందని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. మీరు ఏం చేస్తుున్నారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ లను అమిత్ షా ప్రశ్నించారు.
Amith shah:
నిరసనలు చేయాల్సిందిగా రాష్ట్ర నేతలకు ఎందుకకు సూచించలేదంటూ వారిపై అమిత్ షా సీరియస్ అయ్యారట. నేతలందరూ కలిసి ఉండాలని, వర్గ విబేదాలకు వీడాలని తెలిపారట. ఇంకోసారి ఇలాంటి పరిణమాలు తన దగ్గరకు వస్తే బాగుండదని అమిత్ షా నేతలకకు చెప్పారట. ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్ధతను ఎప్పటికప్పుటు ఎండగడుతేూ ఉండాలని, ఆందోళనలు, నిరసనలు చేయాలని చెప్పారట.