Lemon Pickle: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. మన దేశానికి వచ్చేసరికి దక్షిణాదిలో అన్నం కూరతో ఎక్కువ తమ ఆకలి తీర్చుకుంటారు. ఇక ఉత్తరాదిలో గోధుమ రొట్టెలతో కడుపునింపుకుంటారు. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మన సంస్కృతిలో ఊరగాయ పచ్చళ్ళు ఒక భాగం. అప్పట్లో మన పూర్వికులు సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో పచ్చళ్ళు తయారు చేసేవాళ్లు. ఈ పచ్చళ్ళు తయారీలో చివరకి సూర్యరశ్మిని సైతం వాడేవారు. పచ్చళ్లలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునే వాళ్ళు.
ముఖ్యంగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా.. సహజ సిద్ధ పదార్థాలను ఉపయోగించేవాళ్లు. తిన్నే అన్నంలో పప్పు లేదా పెరుగన్నం ఏది తిన్నా గానీ. ఒకపక్క పచ్చడి తగిలితే ఆ టేస్టే వేరు. దీంతో చాలామంది ఇంటిలోనే రకరకాల పచ్చళ్ళు తయారు చేసుకొని పెట్టుకుంటారు. వీటిలో నిమ్మకాయ ఊరగాయ పచ్చడి… రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ పచ్చడి వల్ల ఎన్ని లాభాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయ ఊరగాయ పచ్చడిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిమ్మకాయ పచ్చడిలో లభిస్తాయని చెబుతారు.
పోషకాహార లోపాన్ని కూడా ఇది భర్తీ చేస్తుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. నిమ్మకాయ పచ్చడి తినటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను రెగ్యులేట్ చేస్తుందట. అంతమాత్రమే కాదు వయసు పెరిగే కొద్దీ ఎముకలు ఆరోగ్యం క్షిణించకుండా కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసేలా ఇమ్యూనిటీ పవర్ పెంచేలా.. నిమ్మకాయ పచ్చడి శరీరానికి ఎంతగానో సహాయపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.