Karthika Deepam Shourya: “కార్తీకదీపం” సీరియల్ లో శౌర్య పాత్రలో అమూల్య ఓంకార్ అందరికీ సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీలో కమలి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. నటి కాకముందు అమూల్య గౌడ్ “యారిగుంటూ యారిగిల్ల” అనే టీవీ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయింది. 2014వ సంవత్సరంలో “స్వాతిముత్తు” తో టెలివిజన్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ మరియు హిందీ సీరియల్స్ లో నటించి తిరుగులేని క్రేజ్ సంపాదించింది.
ఏటువంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేస్తూ.. అమూల్య ఓంకార్.. తెలుగులో “కార్తీకదీపం” ద్వారా బాగా పాపులర్ అయింది. ఒకపక్క సీరియల్స్ లో చేస్తూ మరోపక్క సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి అమూల్య తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో తన అందచందాల ఫోటోలను పోస్ట్ చేస్తూ దక్షిణాదిలోనే టెలివిజన్ రంగంలో ప్రముఖ నటిగా మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది.
దీంతో అమూల్య పెట్టే ప్రతి ఫోటోకు భారీ స్థాయిలో లైకులు వస్తుంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక వైపు మాత్రమే తిరిగి పైన బ్లాక్ స్లీవ్ లెస్ తో కింద బ్లూ జీన్ తో ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జుట్టు వదిలేసి బ్లాక్ వాచీ పెట్టుకొని అమూల్య ఫోటోకి ఫోజులు ఇవ్వడంతో భారీ ఎత్తున.. ఫాలోవర్స్ నుండి రెస్పాన్స్ వస్తూ ఉంది.