Biggboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 సండే ఫన్ డే ఏమో కానీ రెండు లవ్ ట్రాక్‌లను మాత్రం బయటపెట్టింది. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ ఏమీ లేదని ఫీలయిన ఆడియెన్స్‌కు ఇది చాలా చాలా ఆసక్తికర వార్త. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈసారి అంతా మిస్ అవుతున్నట్టు ఫీలవుతున్నారు. కానీ ఈసారి డబుల్ డోస్. ఒకటి కాదు. రెండు లవ్ ట్రాక్‌లు. నామినేషన్, ఎలిమినేషన్, కెప్టెన్సీ లాంటి విషయాల కంటే కూడా వేరే కొన్ని విషయాలు ఇంట్రస్టింగ్‌గా మారాయి. బిగ్‌బాస్ హౌస్‌లో అసలేం జరుగుతోంది.
శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్ మధ్య ఏదో ఉందనే అనిపిస్తున్నా.. ఏమీ లేదేమో అని ఒక్కో సందర్భంలో అనిపిస్తోంది. వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ఇంటా.. బయటా టాక్. మరోవైపు ఆర్జే సూర్య, ఆరోహి రావ్‌ల మధ్య ఏదో ఉందనిపిస్తున్నా.. ఉందా? లేదా? అనేది అర్ధం కావడం లేదు. కానీ బయట మాత్రం పెద్ద కథే నడుస్తోందంటూ టాక్. తమన్నా రాకతో రెండు లవ్ స్టోరీలు బయటపడ్డాయి. బిగ్‌బాస్ హౌస్‌లో ఆదివారం తమన్నా సందడి చేసింది. అయితే కంటెస్టెంట్లతో తమన్నా ఆటలు ఆడించింది. ఇక ఇందులో భాగంగా కొన్ని సీక్రెట్లు బయటకు వచ్చేశాయి.
Biggboss 6 : మూడేళ్లలో పుట్టనిది.. ఇప్పుడు పుడుతుందా?
మొదట ప్రోమోలో అర్జున్, శ్రీ సత్యల విషయం బయటకు వస్తే.. రెండో ప్రోమోలో సూర్య, ఆరోహిల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చేసింది. ఆమె నాకు మంచి ఫ్రెండ్ సర్.. అంతేనని అర్జున్ చెప్పినా కూడా ఎవరూ నమ్మలేదు. ఫ్రెండ్సే రేపు లవర్స్‌గా మారతారని.. తను నటించిన చాలా సినిమాల్లో అలా జరిగిందని మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇక సూర్య తాను బౌన్సర్‌గా భావిస్తున్నది ఆరోహినని పేర్కొంటూ ఆమెకు బ్యాండ్ తొడిగాడు. ఆ సమయంలో ఆడియన్స్ గట్టిగా అరిచారు. ఈ స్పందనకు కారణమేంటని నాగ్ అడగ్గా.. మూడేళ్లలో పుట్టనిది.. ఇప్పుడు పుడుతుందా? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఆరోహి చెప్పింది. నేను అడిగానా? అని నాగ్ నవ్వుతూ అడిగారు. అయితే ఆరోహి – సూర్యల మధ్య ప్రేమ బంధం ఉందని అభినయ చెప్పేసింది. మేము రోజు చూస్తున్నామని వెల్లడించింది.