Samantha: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండడం చేత ఈమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సమంత కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని ఈ అనారోగ్య సమస్యలతో బాధపడటం వల్లే తాను సినిమా షూటింగ్లకు కూడా హాజరు కాలేదంటూ వార్తలు వచ్చాయి.
ఈ విధంగా సమంత ఆరోగ్య సమస్యల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై ఆమె మేనేజర్ స్పందించి ఈ వార్తల పూర్తిగా ఆవాస్తవమని కొట్టి పారేశారు.ఇలా సమంత గురించి వస్తున్న వార్తలపై తన మేనేజర్ స్పందించినప్పటికీ సమంత గురించి మాత్రం ఈ వార్తలు ఆగడం లేదు. ఇదిలా ఉండక సమంత త్వరలోనే అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈమె ఎలాంటి సినిమా షూటింగులకు హాజరు కాకుండా ఉన్నఫలంగా అమెరికా వెళ్లడానికి గల కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సమంత స్కిన్ సమస్యలతో బాధపడుతున్నారని అందుకే అమెరికాలోని ప్రముఖ స్కిన్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసమే సమంత అమెరికా వెళుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.ఈమె చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడటం వల్లే గత కొంతకాలం నుంచి బయట కూడా కనిపించడం లేదని అందుకే సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనడం లేదని తెలుస్తుంది.
Samantha: అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందా…
ఇక సమంత ఇలాంటి సమస్యలతో బాధపడుతుండడం వల్ల ఈమె నటిస్తున్నటువంటి ఖుషి సినిమా కూడా మరింత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా సమంత అనారోగ్య సమస్యల కారణంగానే ఈ సినిమా షూటింగ్ మరికాస్త ఆలస్యం అవుతుందనే వార్తలు వినపడుతున్నాయి.ఇలా సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.