Actress Poorna: నటి పూర్ణ గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షో లతో, మరోపక్క సినిమాలతో.. సోషల్ మీడియాలో ఫోటోలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటది. ముఖ్యంగా “డీ”షో ద్వారా అప్పట్లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది.
కొద్ది నెలల క్రితం పూర్ణకి బిజినెస్ మెన్ షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి ఫిక్స్ అయింది. అయితే ఇటీవల పెళ్లి కుదిరిన నాటి నుండి పూర్ణ తన పంథా మొత్తం మార్చేయడం జరిగింది. పెళ్లి సంబంధం కుదరక ముందు పూర్ణ.. తన హాట్ హాట్ అందాల ఫోటోలతో కుర్ర కారును ఎంతగానో ఆకట్టుకునేది.
అప్పట్లో పూర్ణ అందాల ఫోటోలకు రికార్డు స్థాయిలో లైకులు వచ్చేవి. ఇదిలా ఉంటే ఇప్పుడు పెళ్లి సంబంధం కుదరటంతో.. వస్త్రధారణ విషయంలో గత స్టైల్ మొత్తం మార్చేసింది.
నిండైన బట్టలలో ఫోటోషూట్స్.. చేస్తూ సాంప్రదాయ చీరలలో కనబడుతూ తన ఫాలోవర్స్ కి తనలో ఉన్న మరో కోణాన్ని చూపిస్తూ ఉంది.
గత కొంతకాలంగా చీర కట్టులో కనబడుతున్న పూర్ణ.. లేటెస్ట్ గా సాంప్రదాయ బద్ధమైన వైట్ శారీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
వైట్ చీరతో ఫోటోలు దిగింది. ఈ వైట్ చీర అంచున పచ్చ రంగులో నెమలికల డిజైన్ లో.. రాజకుమారి మాదిరిగా దర్శనమిస్తూ ఉంది.
అతిలోక సుందరి మాదిరి తరహాలో..పూర్ణ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ కేరళ భామ ఇచ్చిన ప్రదర్శనకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు.
కొద్ది గంటల క్రితం ఈ చీరకట్టులో ఉన్న తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పూర్ణ పోస్ట్ చేయడం జరిగింది. చీరకట్టుతో పాటు వాటికి మ్యాచింగ్ చేతులకు గ్రీన్.. గాజులు, మెడలో కూడా గ్రీన్ హారంతో పూర్ణ ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
“ఢీ” డాన్స్ షో నుండి బయటకు వచ్చేసిన పూర్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క బుల్లితెరపై అడపాదప కనిపిస్తుంది.
సౌత్ లో తెలుగులో మాత్రమే కాక పలు భాషల్లో అవకాశాలు అందుకుంటూ ఉంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా నచ్చితే సపోర్టింగ్ రోల్స్ చేయటానికి కూడా వెనుకాడటం లేదు.
గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన “అఖండ” లో మెరిసింది. ప్రస్తుతం “దసరా” ఇంకా “వృత్తం” చిత్రాల్లో నటిస్తూ ఉంది.