Bigboss 6 : బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారంలో హౌస్ లో బాగా ఆడిన వారికి పువ్వులు.. ఆడకుండా కబుర్లు చెబుతూ టైమ్ పాస్ చేసే బ్యాచ్‌కి క్లాసులు బాగా పీకేశారు హోస్ట్ నాగార్జున. ఇనయ.. ఆటలోకి వచ్చావ్.. బాగా ఆడావ్.. మనుషుల సపోర్ట్ లేదని బాధపడకు.. అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. రాజ్.. నువ్ అడుక్కుని కెప్టెన్ అయ్యావ్.. కెప్టెన్ అయిన తీరు కరెక్ట్ కాదు. జాలి కరుణతో అయ్యావ్.. ఓడినా పర్లేదు.. గెలుపు అడుక్కుంటే బాగుండదు.. సెల్ఫ్ సింపతీ వర్కౌట్ కాదు.. నీలో శక్తి ఉంది.. కెప్టెన్‌గా ఏం ప్రూవ్ చేసుకుంటావో చూస్తాం.. అని మందలించారు నాగ్.
నేహా.. దెబ్బలు తగిలాయని ఆటను ఆపకూడదంటూ సలహా ఇచ్చాడు. అర్జున్ నువ్ మాత్రం.. రేవంత్ నా గురించి అదన్నాడు.. ఇదన్నాడు.. తప్పా.. ఇంకేం ఆడటం లేదు.. వారంలో ప్రతీ రోజూ పడుకునే ఉన్నావ్.. కూర్చుని కంప్లైంట్ చేస్తావా?.. గేమ్ మీద దృష్టి పెట్టు అంటూ క్లాస్ పీకారు. ఆరోహి ఒకసారి మాత్రం బ్రెయిన్ వాడావ్.. టార్గెట్ చేసి అర్జున్‌ను పడేద్దామని నువ్వే అన్నావ్. మరి అదే విషయాన్ని రేవంత్ అంటే ఎందుకు ఎమోషనల్ అయ్యావ్ అంటూ సుతిమెత్తగా మందలించాడు. నీ ఆటకు నువ్ 70 మార్కులు ఇచ్చుకున్నావ్.. నేను 50 మార్కులే ఇస్తా.. అని నాగ్ అన్నాడు.
Bigboss 6 : సేఫ్ గేమ్ శ్రీహాన్‌లా తయారయ్యావ్..
శ్రీహాన్.. అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకునే శ్రద్ద.. ఆట మీద పెట్టు.. బొమ్మ పోతే ఎలా ఫీల్ అవ్వాలి.. కానీ నువ్ హాయిగా పడుకున్నావ్.. ఇంటికి పోతే ఇంకా హాయిగా నిద్రపోవచ్చు.. సపోర్ట్ ఉందని అంటే.. కోపం వచ్చింది.. మరి ఆటకు ఏమైంది.. సేఫ్ గేమ్ శ్రీహాన్‌లా తయారయ్యావ్.. వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు.. అని హెచ్చరించాడు. గీతూ.. నీకు వందకు రెండు వంద మార్కులు.. అని నాగ్ మెచ్చుకున్నాడు. మీరు చూసింది 20 శాతం.. ఇంకా భయంకరంగా ఉంది.. సర్ అని గీతూ అంది. నీ బొమ్మనే కాపాడుకోలేకపోయావ్ అని నాగ్ అంటూ.. తాడిని తన్నేవాడు ఒకడుంటే.. తలను తన్నేవాడుంటాడు.. అని రేవంత్ డైలాగ్ గుర్తు చేస్తాడు నాగ్.