Biggboss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. ఇప్పటికే షానీ ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించేశారు. మరి నిజమైన ఎలిమినేషనా? ఫేకా అనేది పక్కనబెడితే.. ఈ రోజు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఈ రోజు పక్కాగా అభినయ శ్రీ ఎలిమినేట్ అవుతుందని టాక్. ఇక్క శనివారం ఒక్కొక్కరికీ పేరు పేరునా లేపి నిలబెట్టి మరీ నాగ్ కడిగి పారేసిన విషయం తెలిసిందే. కొంతమందికైతే పరువు తీసేసి వదిలి పెట్టారంతే. వీళ్లు ఇలాగే ఆడితే రేటింగ్ కిందకే తప్ప పైకి వెళ్లే అవకాశమే లేదని భావించారో ఏమో కానీ ఒక్కొక్కరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేశారు.
చంటిని ఉద్దేశించి.. కెప్టెన్సీ టాస్క్ ఇంపార్టెంటో తెలుసు.. చాలా ఈజీగా తీసుకున్నావ్.. ఎందుకు?.. కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ అని నీకు అర్థం కాలేదా?.. కామెడీ బాగుంది.. నవ్వించే తీరు బాగుంది.. నీ ఆట లోతులో నూతులో ఉంది.. నవ్వించడమే కాదు ఆట కూడా ఆడాలి.. అంటూ నాగ్ క్లాస్ పీకారు. సూర్య.. బయట చాలా పనులు చేస్తావ్ కదా?. ఇక్కడ చిల్ అవ్వడానికి వచ్చావా?.. వండి పెడితే మార్కులు పడతాయ్ అని అనుకున్నావా?.. అంటూ కౌంటర్లు వేశాడు.
Biggboss 6 : అందరినీ కరెక్ట్ చేయడం ఆపేయ్..
ఇక రేవంత్ గురించి చెబుతూ కోపం తగ్గించుకున్నావ్ కానీ పక్కన వాళ్లకి సలహాలు, నీతులు చెప్పకు.. నువ్వేమైనా తోపువా? బొట్టు పెట్టుకుంటే.. నచ్చుతారు.. ఇలా తయారవ్వాలి.. మనుషులు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని చెబుతున్నావ్. అందరినీ కరెక్ట్ చేయడం ఆపేయ్.. నిన్ను నువ్ కరెక్ట్ చేసుకో.. నీ స్నేహితులతో చేసే ఫన్ బాగుంటుంది.. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది.. అందరినీ దగ్గరకు చేసుకుందామని వచ్చావ్.. దూరం చేసుకోవడానికి కాదు.. ఆట మాత్రం ఇరగదీశావ్.. కసి ఉంది కదా? కంటిన్యూ చేయ్.. కోపం తీసేయ్.. కసి ఉంచు.. నిన్ను ఓడించిన వ్యక్తి కోసం ఆడి గెలిపించావ్ కదా? ఎంతో ఎత్తుకు ఎదిగావ్.. అంటూ ప్రశంసలు కురిపించారు నాగ్.