Tdp Mla Bucchaiah: ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయం వైరం తారాస్థాయిలో జరుగుతోంది. ఒక పార్టీపై మరో పార్టీ ఎప్పుడూ విమర్శల దాడి చేసుకుంటూ ఉంటుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దమ్మెత్తిపోసుకుంటూ ఉంటారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి తరుణంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలతో కలిసి హల్ చల్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరో కాదు..
కృష్ణా జిల్లాకు చెందని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ టీడీపీ నేతలతో కలిసి హల్ చల్ చేశారు. టీడీపీ నేతలతో కలిసి ఫొటో దిగారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలతో కలిసి ఫొటో దిగడం ఏంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫొటోపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఫొటో చూసినవారు వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రతిపక్ష టీడీపీలో చేరబోతుున్నారనే ప్రచారం చేస్తున్నారు.
అయితే అది అమెరికాలో దిగిన ఫొటోగా తెలుస్తోంది. గత కొద్ది రోజలు క్రితం వసంత కృష్ణప్రసాద్ అమెరికా వెళ్లారు. ఇక ఆ సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చచౌదరి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా యూస్ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వీరందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో వైరల్ గా మారుతోంది. దీంతో టీడీపీ కార్యకర్తలు ఈ ఫొటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారడానికి గోరంట్ల బుచ్చ చౌదరితో చర్చలు జరుపుతున్నారని ట్రోల్స్ చేస్తుననారు.
Tdp Mla Bucchaiah:
దీనికి వైసీపీ కార్యకర్తలు కూడా గట్టి సమాధానం ఇస్తున్నారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న బుచ్చయ్యచౌదరి వైసీపీలో చేరేందుకు వసంత కృష్ణప్రసాద్ తో చర్చలు జరుపుతున్నారని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. గతంలో బీజేపీ జాతీయ నేతలను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కలిశారని, ఆయన బీజేపీలో చేరినట్లేనాఅనిప్రశ్నిస్తున్నారు. అయితే ఇది పాత ఫొటో అని, ఇప్పటిదీ కాదని కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంి.