Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారంలో హౌస్ లో బాగా ఆడిన కంటెస్టెంట్ గీతు అని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ప్రశంసించారు. 100 కి 200 మార్కులు ఇవ్వచ్చు అని గీతు ఆట తీరుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కేవలం 20% గేమ్ మాత్రమే నా నుండి చూసారు. మిగతా 80% వచ్చే రోజుల్లో చూపిస్తా అంటూ గీతు రిప్లై ఇచ్చింది. మరి అలాంటప్పుడు నీ బొమ్మలు ఎలా పోగొట్టుకున్నావ్. తడిని తన్నేవాడుంటే తలదన్నే వాడుకోడంటాడు అంటూ నాగార్జున కౌంటర్ వేశారు.
అంతా బాగా ఆడిన గాని ప్రేమకు లొంగిపోయాను సార్ అని గీతు రిప్లై ఇవ్వడం జరిగింది. నువ్వు ప్రేమికులంగి పోయావా అని నాగార్జున ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవును సార్ నా మేనకోడలు ఒకసారి ఇవ్వు అని బాలాదిత్య నా బొమ్మ తీసుకున్నారు. సిసింద్రీ టాస్క్ లో… బొమ్మని గీచేయటం పై కూడా నాగార్జున కామెడీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా గేమ్ బాగా ఆడాలని గీతు నీ నాగార్జున పోగడటం జరిగింది. ఇదే సమయంలో వేదిక దగ్గర ఉన్న ఆడియన్స్ సైతం గీతు నిలబడిన వెంటనే చప్పట్లతో మారుమోగించారు.
రెండో వారం ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లలో గీతు చాలా దూకుడు గేమ్ ఆడింది. ముఖ్యంగా సిసింద్రీ టాస్క్ లో అర్థరాత్రి ఎవరిని నిద్ర పోనివ్వకుండా ఉరుకులు పరుగులు పెట్టించింది. ఇతరుల బొమ్మలను దొంగలించడంతోపాటు తన బొమ్మ ఎవరికీ కనబడకుండా చాలాసేపు గీతు.. మిగతా ఇంటి సభ్యులను కంగారు పెట్టించింది. దీంతో రెండో వారంలో గీతు ఆడిన ఆట తీరుకి నాగార్జునతో పాటు ఆడియన్స్ సైతం ప్రశంసించడం విశేషం.