Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్ ల పై సీరియస్ అయ్యారు. అసలు హౌస్ లో వాళ్లు ఆడుతున్నారా అంటూ.. ముందు ఆడియన్స్ ని ప్రశ్నించారు. చాలామంది ఆడుతున్నారని చెప్పటంతో మీరు కూడా మాస్క్ వేసుకుని మాట్లాడుతున్నారు. అసలు ఎవరు గేమ్ సీరియస్ గా ఆడటం లేదు. ఆ తర్వాత హౌస్ లో ఇంటి సభ్యులను పలకరించిన నాగార్జున. ఒక్కొక్కరి ఆట తీరు గురించి డిస్కషన్ చేయడం జరిగింది.
అయితే హౌస్ లో అందరికంటే శ్రీ సత్య ఆట తీరుపై చాలా సీరియస్ అయ్యారు. హౌస్ లోకి కేవలం తినటానికి మాత్రమే వచ్చినట్లుంది అని గాలి తీసేశారు. నీ బొమ్మ పోతున్న గాని .. నీలో చలనం లేదు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా..? అని ప్రశ్నించారు. చాలాసేపు అందరికంటే ఎక్కువగా శ్రీ సత్య కి క్లాస్ పీకారు. ఇక ఇదే సమయంలో వరస్ట్ పెర్ఫార్మర్ గా ఇంటిలో చాలామంది శ్రీ సత్యకి ఓటు వేయడం జరిగింది.
దానికి ముందు హౌస్ లో వేస్ట్ కాండేట్ అని శ్రీ సత్యకి ఆదిరెడ్డి, సుల్తానా, ఆరోహి స్టాంప్ లు వేయడం జరిగింది. 11 మంది హౌస్ మేట్స్ లో ఆరుగురు.. ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ గా శ్రీ సత్య కి ఓటు వేయడంతో.. సండే ఎపిసోడ్ అయిన వెంటనే శ్రీ సత్య జైల్లోకి పంపించాలని కెప్టెన్ రాజ్ కి నాగార్జున ఆదేశించడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే శనివారం ఎపిసోడ్ లో శ్రీ సత్య ఆట తీరుపై నాగార్జున చాలా సీరియస్ అయ్యారు.