Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి సెకండ్ వీకెండ్ ఎపిసోడ్ వాడి వేడిగా సాగింది. హౌస్ లో కంటెస్టెంట్ ల ఆట తీరు ఏం బాగోలేదని.. నాగార్జున శనివారం ఎపిసోడ్ లో మండిపడ్డారు. ముఖ్యంగా వాసంతి, శ్రీ సత్య, అభినయశ్రీ, రోహిత్ మెరీనా, శ్రీహాన్, సుదీప, షానీ, కీర్తి, బాలాదిత్య. ఈ తొమ్మిది మంది అసలు ఆడటం లేదని.. ఒక్కొక్కరికి గట్టిగా నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగింది. హౌస్ లో చిల్ అవడానికి మాత్రమే మీరు ఇక్కడికి వచ్చినట్లుంది అని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరి ఆట తీరు గురించి ప్రస్తావించి.. గట్టి డోస్ ఇచ్చారు.
అనంతరం ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని ప్రకటించి..ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత అందరికీ క్లాస్ పికి షాని ఎలిమినేట్ అయినట్లు తెలియజేశారు. దీంతో షాని.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా నిలిచాడు. హౌస్ లో పెద్దగా ఆడక పోవటంతో పాటు అవకాశాలు వచ్చినా గాని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల పరోక్షంగా ఓడిపోయినట్లు నాగార్జున తెలియజేశారు. అనంతరం షాని.. మాట్లాడుతూ ఇక్కడ కాకపోయినా యాక్టర్ గా ఆడియన్స్ నీ ఎంటర్టైన్మెంట్ చేస్తానని తెలియజేశారు.
రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన నాటి నుండి షాని పేరే వినబడుతుంది. హౌస్ లో పెద్దగా టాస్కులలో ఆడక పోవడంతో పాటు.. స్క్రీన్ స్పేస్ కూడా లేకపోవడంతో షాని ఓటింగ్ లిస్టులో కూడా చివరిలోనే ఉంటూ వస్తున్నాడు. ఆఖరికి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. కాగా డబల్ ఎలిమినేషన్ అని ముందు ప్రకటించడంతో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.