Bigg Boss Season 6 Day 13 First Promo: శనివారం వీకెండ్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఆడటానికి వచ్చారా..? లేకపోతే తినడానికి, పడుకోవడానికి వచ్చారా..? అని కొంతమందిని లేపి నిలదీశారు. మొదటివారం కెప్టెన్ బాలాదిత్య పై మరింత మండిపడ్డారు. నువ్వు హౌస్ లో ఇతరుల గేమ్ కూడా చెడగొడుతున్నావని సీరియస్ అయ్యారు.
దీంతో బాలాదిత్య క్షమాపణలు తెలియజేశారు. నేను మనసుతో ఆలోచించాను సార్ మైండ్ తో కాదు అని రిప్లై ఇచ్చాడు. దీనికి నాగార్జున గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బిగ్ బాస్ ఆటగాడిగా ఆలోచించు.. అని అన్నారు. ఆ తర్వాత రోహిత్ మెరీనా ఇద్దరు జంటగా వచ్చినా గాని హౌస్ లో పెర్ఫార్మెన్స్ పరంగా మైనస్ లోకి వెళ్లిపోయారని మండిపడ్డారు. శ్రీ సత్య నువ్వు గేమ్ లో నీ బొమ్మ పోతే ఎక్కడ ఫీల్ కాలేదు.
కానీ హౌస్ లో నీ ప్లేట్ ఎవరైనా లాగేసుకుంటే ఊరుకుంటావా..? అని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా అభినయశ్రీ, సుదీప పై మండిపడ్డారు. చివరిలో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు. ఎలిమినేషన్ లో ఉన్న సభ్యుల సూట్ కేసులు సర్దుకోని.. స్టోర్ రూమ్ లో పెట్టమని ఆదేశించారు. దీంతో రెండో వారం ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది.