Thulasi Water: ఆయుర్వేదంతో పాటు హిందూ సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను లక్ష్మీ దేవి రూపంగా భావిస్తుంటారు. ఇంట్లో తులసి ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందనే నమ్మకం ఉంది. అదే సమయంలో ఆయుర్వేదంలో అనేక అనారోగ్యాలకు చికిత్సగా తులసిని వాడుతుంటారు.
తులసి ఆకులను మామూలుగా తినడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, తులసి నీళ్లను తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదంలో పేర్కొనబడింది. తులసి నీళ్ల వల్ల జలుబు తగ్గుతుందని, అలాగే దగ్గుతో బాధపడే వారు తులసి నీళ్లు తాగితే ఉపశమనం పొందుతారట. అదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా తులసి నీళ్లు ఉపయోగపడతాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది మధుమేహం అంటే డయాబెటిస్ తో బాధపడుతూ ఉన్నారు. అయితే మధుమేహంతో బాధపడే వారు తులసి నీళ్లు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. తులసి నీళ్లను తాగడం వల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల పరోక్షంగా మధుమేహం కంట్రోల్ లోకి వస్తుందట.
Thulasi Water:
మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడే తులసి నీళ్లను తయారు చేయడం ఎలానో కూడా తెలుసుకోండి. ముందుగా ఒక గ్లాస్ నీళ్లలో తులసి ఆకులను వేసి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత ఆ నీటిని పడపోసుకొని, ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పూట తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయి.