Heart Problems: మన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం తీసుకునే ఆహారంతో పాటు మన శరీరానికి ఎలాంటి శ్రమ లేకపోవడం లాంటి అనేక కారణాల వల్ల అనారోగ్యం తలెత్తుతోంది. అయితే ఈ మధ్యన చిన్న వయసులో ఉన్న వారికి సైతం హార్ట్ ఎటాక్ రావడం గురించి వినే ఉంటారు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందట. ఒకవేళ అలాంటి సంకేతాలు మీకు అందితే వెంటనే అప్రమత్తమవండి.
నిద్రలో అసౌకర్యం:
హార్ట్ ఎటాక్ భవిష్యత్తులో రాబోతందనే దానికి నిద్రలో అసౌకర్యంగా అనుభూతి చెందుతారట. ఈ లక్షణం రాబోయే హార్ట్ ఎటాక్ గురించి మనకు ఓ హెచ్చరిక లాంటిదట. అయితే నిద్రలో అసౌకర్యాన్ని ఒక్కోక్కరు ఒక్కోలా అనుభూతి చెందుతారట. కొందరు ఛాతి బరువుగా ఉన్నట్లు అనుభూతి చెందితే, మరికొందరు చాలా బరువుగా, ఇందకొందరు ఛాతిలో మంట వచ్చినట్లు అనుభూతి చెందుతారట.
శ్వాసలో ఇబ్బంది:
చాలామందిలో హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శ్వాసలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటారట. ఎక్కడూ లేని విధంగా, ఉన్నట్టుండి శ్వాసలో ఇబ్బంది తలెత్తితే అది హార్ట్ ఎటాక్ లక్షణంగా భావించి, అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
గొంతు లేదా దవడలో నొప్పి:
హార్ట్ ఎటాక్ రావడానికి ముందు గొంతులో లేదంటే దవడ భాగంలో నొప్పి వస్తుందట. అయితే గొంతు నొప్పి లేదంటే దవడ నొప్పి వచ్చిందంటే అది హార్ట్ ఎటాక్ లక్షణం అని కాదు కానీ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది.
Heart Problems: వాంతులు రావడం:
కొన్నిసార్లు గుండె సంబంధింత వ్యాధుల లక్షణాల్లో వాంతులు రావడం కూడా ఉండవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు వాంతులు రావడం సాధారణంగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.