Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ ముద్దుగుమ్మ దివి గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో పాల్గొన్న దివి ఒక్కసారిగా బిగ్ బాస్ ద్వారా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ ఇవ్వకముందు మహర్షి సినిమాలో నటించింది. దాంతో పాటు సందీప్ కిషన్ A1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా భారీగా ఫేమ్‌ను సంపాదించుకుందీ. అయితే కేవలం అందంతోనే కాకుండా హౌస్ లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకుందీ బ్యూటీ. ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది.ఇక దివి ఇటీవలే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కీ అందాలకు అను విందు కూడా చేస్తూ ఉంటుంది.ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఈ ముద్దుగా మన ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా మరింత పెరిగింది.
రోజురోజుకీ గ్లామర్ డోస్ ని పెంచుతూ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా దివి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో దివి పచ్చ కలర్ చీర కట్టుకుంది. చిలకపచ్చ చీరలో నడుము అందాలను చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.