ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడు మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి తరువాత రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత యంగ్ హీరోలైన రామ్, నితిన్ కి జోడీగా అవకాశాలు తెచ్చుకున్న ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక తాజాగా సుదీర్ బాబుకి జోడీగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి కృతి శెట్టి వచ్చింది. అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో మరో ఫ్లాప్ మూవీ కృతి శెట్టి ఖాతాలో పడినట్లు అయ్యింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య చేయబోయే సినిమాలో కృతి శెట్టి నటిస్తుంది.
అయితే ఈ అమ్మడుకి వరుసగా హ్యాట్రిక్ పరాజయాలు వచ్చేసరికి సినిమాల ఎంపిక విషయంలో కాస్త అలెర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు కంటెంట్ వినకుండా కాంబినేషన్ చూసుకొని సినిమాలకి కమిట్ అవుతూ వచ్చింది. దీంతో ఏకంగా మూడు ప్లాప్ లు అమ్మడి ఖాతాలో చేరిపోయాయి. ఇదిలా ఉంటె తాజాగా ఈ బ్యూటీ మళ్ళీ మెగా ఫాన్స్ ని, మెగా హీరోలని కాకా పట్టే పనిలో పడిందనే మాట వినిపిస్తుంది. మెగా కాంపౌండ్ లోకి వెళ్తే అక్కడ ఏకంగా నలుగురు స్టార్ హీరోలతో వరుసగా జత కట్టవచ్చని కృతి శెట్టి భావిస్తున్నట్లు బోగట్టా.
గతంలో రకుల్ ప్రీత్ సింగ్ అలాగే మెగా కాంపౌండ్ లోకి వెళ్లి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో జత కట్టింది. ఇప్పుడు కృషి శెట్టి కూడా అలాగే ఛాన్స్ లు సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు టాక్. ఈ నేపధ్యంలోనే తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటిస్తూ అందరి హీరోల గురించి చెప్పుకుంటూ వచ్చింది. అందులో భాగంగా తాను కూడా పవన్ కళ్యాణ్ కి అభిమానిని అని చెప్పింది. ఈ మాట పవర్ స్టార్ అభిమానులనే కాకుండా మెగా హీరోలని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పిందనే టాక్ వినిపిస్తుంది.