సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో అఫీషియల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని జక్కన్న క్లారిటీ ఇచ్చేసాడు. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడి కథగా దీనిని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పాడు. ఈ కారణంగా మెజారిటీ షూటింగ్ విదేశాలలో ఉంటుందని, అలాగే ప్రెజెంట్ నేటివిటీలోనే ఈ కథని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి కథని సిద్ధం చేసినట్లు గతంలో చెప్పారు.
ఇక త్వరలో రాజమౌళి, విజయేంద్రప్రసాద్ మరోసారి కథపై కూర్చొని చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ తన సినిమాకి కావాల్సిన నటీనటులని ముందుగానే ఫైనల్ చేసుకుంటారు. ఓ వైపు కథ చర్చలు నడిపిస్తూనే క్యారెక్టర్స్ కి కాయాల్సిన క్యాస్టింగ్ ని ఖరారు చేసుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఖరారు అయ్యిందనే మాట వినిపించింది. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు తెరపైకి వచ్చింది.
ఇప్పటికే దీపికా ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది. పాన్ వరల్డ్ మూవీగా దీనిని తెరకెక్కిస్తున్న నేపధ్యంలో హాలీవుడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకునేని తీసుకుంటే అక్కడి ఆడియన్స్ ని మరింత బాగా రీచ్ కావొచ్చని భావించి నాగ్ అశ్విన్ ఇలా ప్లాన్ చేశారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం అదే స్ట్రాటజీతో దీపికా పదుకునేని ఫైనల్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. ఆమె కాదంటే ప్రియాంకా చోప్రా పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ నుంచి ఏ హీరోయిన్ ని జక్కన్న ఖరారు చేసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.