Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 13వ రోజు ఎపిసోడ్ లో హౌస్ మొత్తం కామెడీ వాతావరణంతో నిండిపోయింది. ముందుగా కెప్టెన్సీ ఎన్నికల్లో సరదా సరదాగా వచ్చే పాటలకు స్టెప్పులు వేస్తూ… ఇంటి సభ్యులు తమ అమూల్యమైన ఓటు తెలియజేస్తూ రాజ్ నీ రెండో వారం కెప్టెన్సీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ తర్వాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా హీరో సుధీర్ బాబు హీరోయిన్ కృతి శెట్టి.. ఇంటి సభ్యుల చేత కొన్ని టాస్క్ లు ఆడించడం జరిగింది.
దీనిలో భాగంగా ప్రారంభంలో రేవంత్ స్టేజ్ పైకి వస్తున్న సమయంలో చంటి వేసిన డైలాగ్ లు పట్ల రేవంత్ ఎపిసోడ్ చివరిలో ఆదిత్య వద్ద ప్రస్తావించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను సింగర్ నీ… నేను స్టేజి పైకి వెళ్తున్న సమయంలో నాపై జోకులు వేస్తున్నాడు. నేను చేసిన ఫుడ్ పై కూడా రకరకాల కామెంట్లు చేయడం జరిగింది. నేను పాట పాడానంటే అందరూ కూర్చొని పోతారు. ఎవరి టాలెంట్ వాడికుంటుంది.
అతని వేస్తే జోకు.. మిగతా వాళ్ళు వేస్తే తీసుకోలేడు. నేను హౌస్ లోకి వచ్చాక ఫుడ్ చాలా తగ్గించేసా. అయినా గాని నా ప్లేట్ లో భోజనం చూసి నీ సైజుకి అది సరిపోతుందా..? అంటూ అందరి ముందు కామెంట్స్ చేస్తున్నాడు. మిగతావారు కూడా నన్ను అలాగే చూస్తున్నారు. అసలు హౌస్ లో ఈ ఫైమా ఎవరు..? అంటూ ఇష్టానుసారంగా రేవంత్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఆదిత్య దగ్గర మాత్రమే కాదు…ఆరోహి, సుదీప, గీతూ, సుల్తానా వద్ద కూడా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.