Vastu: చీపురును హిందూ సంప్రదాయంలో లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే పొరపాటునా చీపురును పడేసినా లేదంటే కాలికి తగిలినా వెంటనే దానికి నమస్కరిస్తారు. లక్ష్మీదేవి రూపంగా చీపురును భావించే మన వద్ద, చాలామంది చీపురు విషయంలో తప్పులు చేస్తుంటారు. దీని వల్ల అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తుతాయని జ్యోతిష్యంలో చెప్పబడింది. చీపురు వాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
మనలో చాలామంది చీపురు విరిగి పోయినా కానీ దాన్ని ఏదో రకంగా వాడేస్తుంటారు. కానీ విరిగిన చీపురును వాడకూదట. వాస్తుశాస్త్రం ప్రకారం విరిగిన చీపురును వాడటం లేదంటే విరిగిన చీపురును అతికించి వాడటం లేదా చీపురుకు ఏదైనా రిపేర్ చేసి వాడటం ఇంటికి అశుభం కలిగిస్తుందట.
ఊడ్చిన తర్వాత చీపురును చాలామంది నిలబెడుతుంటారు. నిజానికి చీపురును నిలబెట్డం అరిష్టం అట. చీపురును నిలబెట్టడానికి బదులుగా నేలపై ఆన్చాలట. చీపురును నిలబెడితే ఇంట్లో లేదంటే ఆఫీస్ లో డబ్బులు నిలవవట. కాబట్టి చీపురును నిలబెట్టడం మాని, నేల మీద ఆన్చడం అలవాటు చేసుకోండి.
Vastu:
ఊడ్చిన తర్వాత చీపురు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు చెబుతోంది. చీపురు కొన్ని ప్రదేశాల్లో అస్సలు ఉంచకూడదని వాస్తు చెబుతుండగా.. వాటిలో బంగారం ఉండే ప్రదేశం ఒకటి. బంగారం పెట్టే స్థలంలో చీపురును ఉంచడం మంచిది కాదట. అలాగే డబ్బుల పెట్టె లేదంటే గల్లా పెట్టె దగ్గర కూడా చీపురు పెట్టకూడదట.