blood sugar levels: మారిన జీవన విధానం వల్ల మన ఆరోగ్యానికి హామీ లేకుండా పోయింది. అయితే ఈ మధ్యన ఎక్కువ మంది షుగర్ బారిన పడుతూ ఉండటం తెలిసిందే. రక్తంలో షుగల్ లెవల్స్ లో వచ్చిన వ్యత్యాసం వల్ల షుగర్ లేదంటే డయాబెటిస్ వస్తోంది. నిజానికి షుగర్ వస్తే అన్ని రకాల రోగాలకు ఆహ్వానం పలికినట్లే అని అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే డయాబెటిస్ రోగులకు ఎలాంటి మందులు సరిగ్గా పని చేయవు.
అయితే డయాబెటిస్ లేదంటే మనం మామూలుగా చెప్పుకునే షుగర్ వ్యాధిగ్రస్తులు వంటింట్లో మనం సాధారణంగా ఉపయోగించే పలురకాల ఆహార పదార్థాలను వాడి షుగర్ లెవల్ ను బాగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో బ్లడ్ షుగర్ లెవల్ ను నియంత్రణలో ఉంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
దాల్చిన చెక్క:
సాధారణంగా మన వంటింట్లో ఇది వాడుతూ ఉంటారు. కాస్త ఘాటుగా అనిపించే దాల్చిన చెక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అంటే రక్తంలో షుగర్ స్థాయి తగ్గుతుంది.
మెంతులు:
ఆయుర్వేదంలో ఎంతో ఉపయోగించే మెంతులను కూడా డయాబెటిస్ నియంత్రణకు వాడతారు. రుచికి కాస్త చేదుగా అనిపించే మెంతులు ఆరోగ్యానికి మాత్రం మంచి చేస్తాయి. మెంతులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఫలితంగా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
blood sugar levels:
మిరియాలు:
ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే మిరియాలను తీసుకోవడం వల్ల కూడా డయాబెటిక్ రోగులు ఉపశమనం పొందవచ్చు. మిరియాల వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్ తగ్గుతుంది. నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ వల్ల డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు కలుగుతుంది.
అల్లం:
వంటింట్లో సర్వసాధారణంగా, వంటల్లో సాధారణంగా ఉపయోగించే అల్లం కూడా డయాబెటిక్ రోగులకు వరంలాగా పని చేస్తుంది. అల్లంలో యాంటీ డయాబెటిక్, హైపోలిపిడెమిక్, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇది జీవక్రియను పెంచడంలో మరియు షుగర్ లెవల్స్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.