Bigg Boss Season 6 Day 12 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 13వ రోజు ఎపిసోడ్ లో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా హీరో సుధీర్ బాబుతో పాటు హీరోయిన్ కృతి శెట్టి అడుగు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా హీరో హీరోయిన్ ముందు ఇంటి సభ్యులు పలు స్కిట్ లు చేశారు. ముందుగా ప్రోమోలో రేవంత్ “పోకిరి” సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్పాడు. గీతు రాయల్.. ప్రభాస్ “బుజ్జిగాడు” సినిమాలో డైలాగ్ చెప్పింది.
ఆ తర్వాత శ్రీహాన్ ఫైమా.. మహేష్ బాబు స్లాంగ్ లో డైలాగ్ చెప్పటం జరిగింది. నేహా చౌదరి.. సూర్య విజయ్ దేవరకొండ స్లాంగ్ లో డైలాగ్ చెబుతూ స్కిట్ చేశారు. ఈ క్రమంలో తర్వాత చంటి, సూర్య, అభినయశ్రీ, షానీ స్కిట్ చేశారు. అర్ధరాత్రి దొంగతనంగా గుడ్లు తింటావు నాకు ఒక గుడ్డు అయినా పెట్టావా అంటూ చంటి సూర్యకాలర్ పట్టుకున్నాడు. వెంటనే సూర్య.. చంటి చంప మీద గట్టిగా ఇచ్చాడు.
దీంతో హీరో సుధీర్ బాబు ఈ స్కిట్ కి షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీహాన్, రాజ్, శ్రీ సత్య స్కిట్ చేశారు. తర్వాత సూర్య వీళ్ళతోపాటు జాయిన్ అయ్యాడు. మొత్తం మీద శుక్రవారం ఎపిసోడ్ లో.. సుధీర్ బాబు.. కృతి శెట్టి రాకతో హౌస్ లో అదిరిపోయే స్కిట్ లు ఇంటి సభ్యులు చేయడం జరిగింది.